ఇంట్లోనూ... సీతాకోక చిలకల సోయగం...

రంగురంగుల సీతాకోకచిలుకలు కళ్లముందు ఎగురుతుంటే మనసూ మబ్బుల్లో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది కదా! దాని సుతిమెత్తని రెక్కలు ముట్టుకుంటేనే మన వేళ్లకు రేణువులు అంటుకుంటాయి.

Updated : 07 May 2024 15:29 IST

రంగురంగుల సీతాకోకచిలుకలు కళ్లముందు ఎగురుతుంటే మనసూ మబ్బుల్లో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది కదా! దాని సుతిమెత్తని రెక్కలు ముట్టుకుంటేనే మన వేళ్లకు రేణువులు అంటుకుంటాయి. ఆ సుకుమార సీతాకోకచిలుకను ప్రేమించని వారెవరు? అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే ఆ సీతాకోకచిలుకలు... వాల్‌ డెకార్ల రూపంలో ఎప్పటి నుంచో ఉన్నా, ప్రకృతి ప్రేమికులు మాత్రం అన్నింటా సీతాకోకచిలుకల సోయగం ఉండాలని భావిస్తున్నారు. రకరకాల రూపాల్లో ఇంటీరియర్‌లో ఒదిగిపోయే ఇవి చూపరుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి. రంగురంగుల రూపాల్లోనే కాదు నేటి తరం అభిరుచులకు తగినట్లు సింపుల్‌ డిజైన్‌, లేత వర్ణాల్లో మార్కెట్లో లభిస్తున్నాయి. బుక్‌ హోల్డర్‌గా, కర్టెన్‌ టైబ్యాక్‌లుగా, బెడ్‌ సైడ్‌ ల్యాంపుల్లా, డైనింగ్‌ టేబుల్‌లా, వాల్‌ మౌంటెడ్‌ ప్లాంటర్లలా... ఎన్నో రూపాల్లో ఇంటికి సరికొత్త అందాన్ని తెస్తున్నాయి. మీకూ నచ్చాయా... అయితే ఈ సీతాకోకచిలుకలను మీ ఇంట్లోకీ ఆహ్వానించండి. రెక్కలు కట్టుకుని వాలిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్