మొక్కలు... సురక్షితమిలా!

మొక్కల ఆరోగ్యం కోసం ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా... పిండి నల్లి సహా కొన్ని కీటకాలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటికి ఈ సహజ పురుగుమందులతో చెక్‌ పెట్టేయండి.

Published : 07 May 2024 01:36 IST

మొక్కల ఆరోగ్యం కోసం ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా... పిండి నల్లి సహా కొన్ని కీటకాలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటికి ఈ సహజ పురుగుమందులతో చెక్‌ పెట్టేయండి.

  •  రెండు మగ్గుల నీటికి మూడు గుప్పెళ్ల వేపాకు చేర్చి మరిగించాలి. నీళ్లు సగమయ్యాక దించేయాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి, వేపాకు నీటికి చేర్చాలి. స్ప్రేబాటిల్‌లో సగం చొప్పున మామూలు నీళ్లు, వేప మిశ్రమాన్ని తీసుకొని దానికి స్పూను చొప్పున రిఫైన్డ్‌ ఆయిల్‌, లిక్విడ్‌ డిష్‌వాష్‌ చేర్చి బాగా కలపాలి. దీన్ని మొక్కలపై వారానికి రెండుసార్లు పిచికారీ చేస్తే సరి.
  •  లీటరు నీటికి స్పూను లిక్విడ్‌ డిష్‌వాష్‌ లేదా షాంపూ చేర్చాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలపై చల్లినా కీటకాల బెడద తగ్గుతుంది. అయితే పురుగులు మొదలైన తొలిదశలోనే ఇది బాగా పనిచేస్తుంది.
  • చిన్న అల్లం ముక్క, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని లీటరున్నర నీటికి చేర్చి రోజంతా వదిలేయాలి. తరవాత నీటిని వడకట్టి మొక్కలకు పురుగుల మందులా వాడుకోవచ్చు. ఇదీ మంచి కీటక నాశినే. అయితే... పురుగుల మందుల పిచికారీని సాయంత్రం లేదా రాత్రివేళల్లోనే చేయాలి. అప్పుడే ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్