పనిభారం ఉండదిక..!

వంట చేసినంతసేపూ కూరగాయలు కడగడం దగ్గర నుంచీ గిన్నెలు తోమడం వరకూ సింక్‌ను ఏదో విధంగా ఉపయోగిస్తూనే ఉంటాం.

Updated : 08 May 2024 15:04 IST

ఉన్న కొద్ది సమయంలోనే వంటపని చకచకా పూర్తి చేసుకుని, మిగతా పనుల్లోకి వెళ్లిపోవాలన్నది ప్రస్తుతం చాలామంది ఆలోచన. అందుకు ఉపయోగపడే కొన్ని కిచెన్‌ పరికరాలు ఇవి... మీరూ చూసేయండి!

నీళ్లు నిలవకుండా...

వంట చేసినంతసేపూ కూరగాయలు కడగడం దగ్గర నుంచీ గిన్నెలు తోమడం వరకూ సింక్‌ను ఏదో విధంగా ఉపయోగిస్తూనే ఉంటాం. దాంతో ట్యాప్‌ దగ్గర ఎప్పుడూ నీళ్లు నిలిచి తేమగానే ఉంటుంది. దాన్ని ప్రతిసారీ శుభ్రపరచాలంటే కష్టమే. అందుకే ఆ శ్రమ లేకుండా సింక్‌ స్ల్పాష్‌ గార్డులను తెచ్చుకుంటే సరి. సిలికాన్‌తో తయారుచేసిన వీటికి, నిలిచిన నీళ్లు పోయేలా ఏటవాలుగా ఉండే చిన్న అవుట్‌లెట్స్‌ ఉంటాయి. అంతేకాదు, వీటిపై డిష్‌ సోప్‌, స్పాంజ్‌, బ్రష్‌ లాంటివీ పెట్టుకోవచ్చు. సింక్‌ దగ్గర గజిబిజిగా లేకుండానూ ఉంటుంది. చుట్టూ నీటి మచ్చలు లేకుండా సింక్‌ శుభ్రంగా కనిపిస్తుంది. సిలికాన్‌తో తయారుచేసింది కాబట్టి తుప్పు పట్టే అవకాశమూ లేదు.


వెంటనే పొడి అవ్వాలంటే...

సాధారణంగా ఆహారం వండేటప్పుడైనా, తినేటప్పుడైనా సాల్ట్‌, పెప్పర్‌ వంటివి ఒక్కోసారి తక్కువ అవుతుంటాయి. అందుకే వాటిని మనం సిద్ధంగా ఉంచుకోవాలి. అయితే ప్రతిసారీ ఆ పొడిని తయారుచేసుకోడానికి సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ‘ఎలక్ట్రిక్‌ సాల్ట్‌పెప్పర్‌ గ్రైండర్‌’ బాగా ఉపయోగపడుతుంది. దీన్లో ఉప్పు లేదా పెప్పర్‌ను వేసి, తిప్పితే చాలు. పరికరం పైభాగంలో ఉండే నాబ్‌ని సవ్యదిశలో తిప్పితే, సాల్ట్‌ మెత్తటి పొడి అవుతుంది. ఒకవేళ బరకగా కావాలనుకుంటే, అపసవ్యదిశలో తిప్పితే సరి. వెలుతురు అంతగా లేదన్న సమయంలో ఎంత సాల్ట్‌, పెప్పర్‌ ఆహారంలో కలుపుకొంటున్నామో తెలియాలంటే మధ్యభాగంలో చిన్నగా తిప్పితే చాలు. నీలిరంగు ఎల్‌ఈడీ కాంతి పడుతుంది. దానివల్ల ఎక్కువ పడిపోతుందేమో అన్నభయం కూడా ఉండదు. ?


మన్నిక, డిజైన్‌ రెండూ...

ప్రస్తుతం అందరూ సస్టెయినబిలిటీకి ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే స్టీలువి కాకుండా చెక్కతో చేసిన వస్తువులు వంటగదిలో ఉండాలనుకుంటున్నారు. దాంతో తయారీదారులు నేటి తరానికి తగ్గట్లు డిజైన్లలోనూ మార్పులు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. కూర, వేపుళ్లు చేసే గరిటెలు, వడ్డించుకునే స్పూన్లు రకరకాల డిజైన్లలో లభిస్తున్నాయి. చెక్కవి కాబట్టి, ఎక్కువ కాలం మన్నుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్