వాషింగ్‌ మెషీన్‌ వాడేద్దామిలా!

ఇంటి పనిని సులువు చేసేందుకు మహిళల సౌకర్యంకోసం ఎలక్ట్రానిక్‌ పరికరాలెన్నో వచ్చేశాయి. వాటిల్లో బట్టలుతికే వాషింగ్‌ మెషీన్‌ కూడా ఒకటి. వాస్తవానికి వాటిని కొన్నప్పుడు కంపెనీ వారు కొన్ని సూచనలు చేసినా సాధారణంగా గుర్తుపెట్టుకోవలసిన అంశాలు కొన్ని ఉంటాయి.

Published : 08 May 2024 02:37 IST

ఇంటి పనిని సులువు చేసేందుకు మహిళల సౌకర్యంకోసం ఎలక్ట్రానిక్‌ పరికరాలెన్నో వచ్చేశాయి. వాటిల్లో బట్టలుతికే వాషింగ్‌ మెషీన్‌ కూడా ఒకటి. వాస్తవానికి వాటిని కొన్నప్పుడు కంపెనీ వారు కొన్ని సూచనలు చేసినా సాధారణంగా గుర్తుపెట్టుకోవలసిన అంశాలు కొన్ని ఉంటాయి.

  • వాషింగ్‌ మెషీన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ప్రతి ఇరవై రోజులకోసారి నీళ్లలో బ్లీచింగ్‌ లేదా వంటసోడా వేసి ఖాళీగా తిప్పితే సరి. ఇలా చేయడం వల్ల లోపల క్రిమిరహితంగా మారుతుంది.
  • బట్టలు ఉతకడమే కాదు...దాన్ని సరిగా వాడుతున్నామో లేదో గమనించుకోవాలి. ప్రతి మూడు వాష్‌లకు ఒకసారైనా బెల్ట్‌లోపల స్పాంజితో శుభ్రం చేయాలి. లేదంటే అక్కడ చేరిన మురికి మెషీన్‌ని పాడు చేయడంతో పాటు మనకీ అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుంది.
  • డిటర్జెంట్‌ బాక్స్‌ను కూడా వారానికోసారి శుభ్రం చేయాలి. అవసరమనుకుంటే వేడినీటితో శుభ్రపరచాలి. తరవాత పూర్తిగా ఆరాక మూత వేయాలి.
  • బాగా మురికి పట్టినప్పుడు మాత్రమే కాదు జ్వరం, ఫ్లూ ఇతర అంటువ్యాధులతో ఇబ్బందిపడుతున్నప్పుడు ముందు వేడినీటిలో పావుగంట పాటు నానబెట్టి తరవాత వాషింగ్‌ మెషిన్‌లో వేయాలి. అప్పుడే బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌ వంటివి తొలగిపోతాయి.
  • బ్లీచ్‌ బేస్డ్‌ సబ్బు, సర్ఫ్‌లను వేసి దుస్తులు ఉతికేటప్పుడు ముప్ఫె-నలభై డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతపై ఉతికితే బట్టలు త్వరగా శుభ్రపడతాయి. జీన్స్‌ వంటి దుస్తులు ఉతికేటప్పుడు వేడినీళ్లలో అంటే అరవై డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలో పెడితే రంగు మారే ప్రమాదం ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్