చేతులు మండుతున్నాయా..!

వంటన్నాక ప్రతిదానిలో పచ్చిమిర్చిని తప్పక వాడుతుంటాం. కొంతమందికి వీటిని కోస్తే చేతులు మండుతాయి. దీనికి కారణం మిర్చిలో ఉండే క్యాప్సైసిన్‌ అనే రసాయనం. ఈ చిట్కాలు పాటించడంతో ఉపశమనం పొందవచ్చు.

Published : 19 May 2024 01:39 IST

వంటన్నాక ప్రతిదానిలో పచ్చిమిర్చిని తప్పక వాడుతుంటాం. కొంతమందికి వీటిని కోస్తే చేతులు మండుతాయి. దీనికి కారణం మిర్చిలో ఉండే క్యాప్సైసిన్‌ అనే రసాయనం. ఈ చిట్కాలు పాటించడంతో ఉపశమనం పొందవచ్చు.

  • పచ్చిమిరపకాయలు కోసిన వెంటనే టొమాటోలను కోయడమో లేదా ఆ గుజ్జుతో చేతులను శుభ్రం చేసుకుంటేనో  మంట తగ్గుతుంది. మరీ ఎక్కువ మంట అనిపిస్తే చపాతీపిండి లేదా పూరీపిండిని కలపడంతో ఉపశమనం కలుగుతుంది.
  • నిమ్మరసంలో విటమిన్‌- సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి మంటను తగ్గిస్తాయి. పచ్చిమిర్చి కోస్తే సమస్య ఉన్నవారు నిమ్మచెక్క లేదా రసంతో చేతులను రుద్ది కడిగితే యాంటీసెప్టిక్‌గా పనిచేసి మంటను తగ్గిస్తాయి. చేతులూ ఎర్రబడవు.
  • పచ్చిమిర్చిని కోసిన తరవాత ఐస్‌క్యూబ్స్‌తో కాసేపు చేతులను రుద్దాలి. లేదా కలబంద గుజ్జు రాసినా, చక్కెరతో చేతులను కడిగినా ఉపశమనం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్