వెదురు సోయగం చూద్దామా!

కాలుష్య రహితం, పర్యావరణ హితం కావడంతో ఈ మధ్య వెదురు ఫర్నిచర్‌ని ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కుర్చీలూ, టేబుళ్లే కాదు... రూమ్‌ డివైడర్స్, షెల్ఫ్స్‌...వంటి కొత్త రకాలతో కనికట్టు చేస్తోంది.

Published : 20 May 2024 01:37 IST

కాలుష్య రహితం, పర్యావరణ హితం కావడంతో ఈ మధ్య వెదురు ఫర్నిచర్‌ని ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కుర్చీలూ, టేబుళ్లే కాదు... రూమ్‌ డివైడర్స్, షెల్ఫ్స్‌...వంటి కొత్త రకాలతో కనికట్టు చేస్తోంది.

ఇల్లు అందంగా ఉండాలంటే ఖరీదైన ఫర్నిచరే అక్కర్లేదంటోంది ఈతరం. అందంగానే కాదు, ఆధునికంగానూ కనిపిస్తోన్న బాంబూ ఫర్నిచర్‌ ఆరోగ్యానికీ మంచిదంటూ తమ ఓటేస్తోంది. నిజానికి పాతే కొత్తగా మెప్పిస్తోన్న ఈ వెదురు ఫర్నిచర్‌కి వేల సంవత్సరాల చరిత్ర ఉందట. అవును ఇప్పుడు మనం వాడే ఫర్నిచర్‌...  కుర్చీలు, టేబుళ్లు ఇతర గృహోపకరణాలను ప్రాచీన ఈజిప్ట్‌లో మొదట వాడారట.

ఆ తరవాత కాలంలో ఇండియా, చైనాలోనూ సంపన్నులకోసం వీటిని తయారు చేయడం ప్రారంభించారట. అప్పటి నుంచి వెదురు ఎన్నో వన్నెలద్దుకుంది. క్రమంగా ఇల్లూ, వ్యవసాయ అవసరాలకు వాడే తట్టలూ బుట్టలూ గంపలూ, చేటలూ, తడికెలు వంటి ఎన్నో రూపాల్లోకి మారిపోయింది. తక్కువ ధరకే లభ్యమవడంతో పేదవాడి కలపగానూ పేరొందింది.

కొన్నాళ్లు మరుగున పడిన బాంబూ ఫర్నిచర్‌కి ఇప్పుడు మళ్లీ గుర్తింపు వచ్చింది. కొత్తగా నిర్మించే ఎకోఫ్రెండ్లీ, సస్టెయినబుల్‌ మోడల్‌ ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక స్థానం అందుకుంటోంది. దళసరిగా ఉండే సాధారణ బాంబూ రకాలతో పాటు వికర్, ర్యాటన్‌ కేన్‌లతో కలగలసి టీపాయిలు, టేబుళ్లు, మంచాలు, బీరువాలు ఇలా ఒకటేమిటి... ఎన్నెన్నో డిజైన్‌లతో మెప్పిస్తోంది. వీటినోసారి మీరూ చూస్తే మనసుపారేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్