అన్నిటికీ అనువుగా...

వంటపనంటే ఒకప్పటిలా ఎడతెరపిలేకుండా చేసేది కాదిప్పుడు. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి  కొత్త పరికరాలు వచ్చేసి, ఆ పనిని సులువు చేస్తున్నాయి.

Published : 22 May 2024 01:22 IST

స్మార్ట్‌ కిచెన్‌

వంటపనంటే ఒకప్పటిలా ఎడతెరపిలేకుండా చేసేది కాదిప్పుడు. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి  కొత్త పరికరాలు వచ్చేసి, ఆ పనిని సులువు చేస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవి...


గిన్నెలు వరుసలో...

వంటగదిలో మిగతా వస్తువులన్నింటినీ సర్దుకోవడం ఒక ఎత్తు... చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్ల వంటివాటిని సర్దుకోవడం మరొక ఎత్తు. గాజు, సెరామిక్‌ వంటివైతే మరింత జాగ్రత్తగా శుభ్రపరిచి కబోర్డ్‌లో పెట్టాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఈ ‘రిట్రాక్టబుల్‌ డ్రెయిన్‌ బౌల్‌ హోల్డర్‌’ను తెచ్చుకుంటే పని సులువవుతుంది. గిన్నెలు తోమిన తర్వాత ఇందులో జాగ్రత్తగా పేర్చుకోవచ్చు. దీని అడుగున ఉండే డ్రెయిన్‌ బోర్డులోకి నీళ్లు వెళ్లిపోతాయి. గిన్నెల సైజుకు తగినట్టు మార్చుకోవచ్చు కూడా. గిన్నెలు అటూఇటూ పడిపోకుండా చుట్టూ స్థంభాల లాంటివీ ఉంటాయి. అవసరమైనప్పుడు దీని విడిభాగాలు తీసి శుభ్రపరచుకోవచ్చు. డైనింగ్‌ టేబుల్‌ మీద, కబోర్డుల్లోనూ వీటిని చక్కగా అమర్చుకోవచ్చు.


చెంచాతో ఇబ్బంది లేదు...

మసాలాలు, ఉప్పు, కారం లాంటి వాటిని డబ్బాలో నింపి పెట్టుకుంటాం. కానీ వాటితోపాటు వచ్చిన చెంచాలు మాత్రం అందులో ఇమడవు. దాంతో వాటిని పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ప్రతిసారీ స్పూనుకోసం వెతకాల్సి వస్తుంది. అలాకాకుండా ఈ రిట్రాక్టబుల్‌ సీజనింగ్‌ జార్‌లను తెచ్చేసుకోండి. దీనికి ఉండే మూతలోనే చెంచా కూడా దానికే ఉంటుంది. దానికి పొడవుని అడ్జస్ట్‌ చేసుకునేట్లుగా స్లైడింగ్‌ బటన్‌ ఉంటుంది. డబ్బాలోని దినుసుల పరిమాణానికి అనుగుణంగా మనకు కావాల్సిన లెన్త్‌లో దాన్ని పెట్టుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్