ఇంటి అందానికి... వర్లీ

ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడంలో ఒకొక్కరిదీ ఒక్కో అభిరుచి. అయితే, ఈ మధ్య మాత్రం ఎక్కువమందిని మెప్పిస్తోంది వర్లీ ఆర్ట్‌. దీన్ని గోడంతా పెయింటింగ్‌లా వేయించుకునేవారు కొందరైతే, ఈ కళను ఫ్రేమ్‌లో బంధించి గోడకు వేలాడదీసేవారు మరికొందరు.

Published : 27 May 2024 01:41 IST

ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడంలో ఒకొక్కరిదీ ఒక్కో అభిరుచి. అయితే, ఈ మధ్య మాత్రం ఎక్కువమందిని మెప్పిస్తోంది వర్లీ ఆర్ట్‌. దీన్ని గోడంతా పెయింటింగ్‌లా వేయించుకునేవారు కొందరైతే, ఈ కళను ఫ్రేమ్‌లో బంధించి గోడకు వేలాడదీసేవారు మరికొందరు. ఈ చిత్రకళ మహారాష్ట్ర ప్రాంతంలోని ఆదివాసీ మహిళల అద్భుత సృష్టి. నిజానికి ఇదెప్పుడు పుట్టిందో సరైన ఆధారాలు లేవు కానీ పదో శతాబ్దం నాటి మూలాలు మాత్రం దొరికాయట. 70వ దశకం తరవాతే ఈ కళ నాగరిక ప్రపంచానికి తెలిసింది. సాధారణంగా వర్లి, మల్ఖర్‌...అనే గిరిజన తెగల్లోని వివాహిత స్త్రీలు మాత్రమే ఒకప్పుడు ఈ పెయింటింగ్‌ వేసేవారట. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగలు వంటి శుభకార్యాలు జరిగినప్పుడూ, పంట కోతకు వచ్చే సమయంలోనూ గోడలూ, ఇంటి పైకప్పులపై వెదురు కుంచెతో వీటిని గీస్తారు. ఇందులో ఆధ్యాత్మిక అంశాలేవీ కనిపించవు. వారి సాంఘిక జీవనంతో ముడిపడి ఉన్న పశుపక్ష్యాదులు, మనుషులు, ప్రకృతిలోని వివిధ అంశాలను... చుక్కలు, గీతల రూపంలో చూడచక్కని చిత్రలేఖనంగా మలుస్తారు. ఈ ఆర్ట్‌ ఇప్పుడు ఆధునిక ఇంటీరియర్‌లోనూ భాగమైపోయింది. ఇటు సంప్రదాయ ఆలోచనలు ఉన్నవారినీ, అటు ట్రెండింగ్‌ స్టైల్స్‌ని ఇష్టపడేవారినీ కూడా మెప్పించగలుగుతోందీ. అలా అందంగా ఒదిగిపోయిన వర్లీ వాల్‌ డిజైన్లు చూడండి. మీరూ ఎంత బాగున్నాయో అనుకోకుండా ఉండలేరు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్