వీళ్ల బద్ధకానికి పిల్లలు బలి అవ్వాలా?

ఉదయం 9గంటలకల్లా ఇంటి నుంచి బయటపడతా. ఆఫీసుకు వచ్చాక నేను నా పని త్వరగానే ముగిస్తా. మిగతావాళ్లే చాటింగులు, ముచ్చట్లతో గడిపేస్తారు. తీరా ఆఫీసు వేళలు ముగిసే సమయానికి వాళ్లకి పని గుర్తొస్తుంది. అప్పుడు సందేహాలంటూ నాకూ ఆలస్యం చేస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తుంటారు. వీళ్ల బద్ధకానికి పిల్లలను బలిచేస్తున్నా అనిపిస్తోంది.

Published : 11 Jun 2024 15:04 IST

ఉదయం 9గంటలకల్లా ఇంటి నుంచి బయటపడతా. ఆఫీసుకు వచ్చాక నేను నా పని త్వరగానే ముగిస్తా. మిగతావాళ్లే చాటింగులు, ముచ్చట్లతో గడిపేస్తారు. తీరా ఆఫీసు వేళలు ముగిసే సమయానికి వాళ్లకి పని గుర్తొస్తుంది. అప్పుడు సందేహాలంటూ నాకూ ఆలస్యం చేస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తుంటారు. వీళ్ల బద్ధకానికి పిల్లలను బలిచేస్తున్నా అనిపిస్తోంది. వీళ్లకి అర్థమయ్యేలా మాట్లాడనా? పైవాళ్లకి ఫిర్యాదు చేయనా?

ఓ సోదరి

టువంటి పరిస్థితి ఉద్యోగం చేసే అమ్మలకి చాలా చిరాకు తెప్పిస్తుంది. కుటుంబానికి దూరంగా ఉన్న ప్రతి నిమిషం చాలా విలువైనది. కాబట్టి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. అయితే, నిబద్ధతతో పనిచేయడమంటే ఎక్కువ గంటలు పనిచేయడమే అనుకుంటారు కొందరు. అందుకే ఉద్యోగం, వ్యక్తిగత జీవితాల మధ్య వ్యత్యాసం కనుమరుగవుతోంది. మనకు ఉన్న సమయంలో పని పూర్తిచేసుకోకపోతే తరవాత వ్యక్తిగత సమయాన్నీ వెచ్చించాల్సి వస్తుంది. వ్యాయామం చేయడానికో, కుటుంబం, స్నేహితులతో గడిపే సమయం ఈ పనికి కేటాయించాల్సి వస్తుంది. అలా చేస్తే మన శారీరక, మానసిక ఆరోగ్యాల్ని కాపాడుకోలేం. క్రమంగా ఉత్పాదకతా తగ్గుతుంది. అందుకే ముందు మీ సహోద్యోగులతో ఒకసారి మాట్లాడండి. సమస్య ఏంటో వాళ్లకు తెలియజేయండి. మీ వల్లే ఆలస్య మవుతోంది అన్నట్లు కాకుండా, నిర్దేశిత సమయానికి పని పూర్తిచేసుకోవాలి కదా? అన్నట్లు చెప్పండి. రోజు ప్రారంభంలోనే మీ నుంచి వాళ్లకు ఏమైనా సాయం కావాలేమో అడగండి. అవసరమైన వనరులు సమకూర్చండి. ఇలా రెండు వారాలపాటు కొనసాగించండి. అప్పటికీ వాళ్లలో ఎటువంటి మార్పూ కనిపించకపోతే పైవాళ్లకు ఫిర్యాదు చేయొచ్చు. ఇటువంటి విషయాల్లో వెంటనే స్పందించడం అవసరం. అయితే దాంతోపాటు అంతే ప్రొఫెషనల్‌గా, కామ్‌గా పరిష్కరించుకోవడమూ ముఖ్యమే.    

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్