పుస్తకాలకు అట్టలేస్తున్నారా?

పిల్లలకు సెలవులు ముగుస్తున్నాయి. త్వరలో స్కూళ్లు ప్రారంభమవుతాయి. అన్నీ సమకూర్చడం మొదలుపెట్టాలి కదూ! వాటిల్లో పుస్తకాలు జాగ్రత్తగా ఉండటానికి వేసే అట్టలొకటి.

Published : 10 Jun 2024 02:19 IST

చలో స్కూల్‌

పిల్లలకు సెలవులు ముగుస్తున్నాయి. త్వరలో స్కూళ్లు ప్రారంభమవుతాయి. అన్నీ సమకూర్చడం మొదలుపెట్టాలి కదూ! వాటిల్లో పుస్తకాలు జాగ్రత్తగా ఉండటానికి వేసే అట్టలొకటి. చిన్నగానే కనిపిస్తుంది కానీ... పూర్తయ్యేసరికి వెన్నునొప్పి ఖాయం. దాన్నీ సులువు చేస్తూ కొన్ని అమరికలొచ్చాయి.

పుస్తకానికి సరిపోయేంత కవర్‌ తీసుకోవడం, మలవడానికి అనువుగా కత్తిరించుకోవడం, పిన్నులు కొట్టడం అబ్బబ్బా ఎంత పనో. ఇదంతా లేకుండా కేవలం మడిచేస్తే సరిపోయేలా ఉంటే బాగుండు అనిపిస్తోందా? అయితే, రెడీ టూ యూజ్‌ బుక్‌ కవర్స్‌ తెచ్చుకోండి. పుస్తకాన్ని పెట్టి, మడిచి, పిన్నులు కొట్టుకుంటే చాలు. కొన్నింటికి ఆ శ్రమ కూడా లేకుండా అతికించుకునే వీలూ ఉంది.

పర్యావరణ ప్రేమికులా? పుస్తకాలకు వేసే ప్లాస్టిక్‌ కవర్‌తో... పర్యావరణానికి ఇబ్బంది అనిపిస్తుంటుందా? అయితే రీయూజబుల్‌ బుక్‌ కవర్స్‌ తెచ్చేయండి. పిల్లలు మెచ్చే పండ్లు, కార్టూన్లు, బొమ్మల రూపాల్లోనూ దొరుకుతున్నాయి. పుస్తకాలకు తగిలించడమే. పైగా తిరిగి వాడుకోవచ్చు. కాస్త కళ తగ్గినట్టు అనిపిస్తే ఉతుక్కుంటే సరిపోతుంది.

ట్రాన్స్‌పరెంట్‌ స్టిక్కర్‌ బుక్‌ కవర్స్‌... వీటికున్న స్టిక్కర్‌ను తీసి, పుస్తకాన్ని ఉంచితే చాలు. చక్కగా అతుక్కుపోతుంది. కత్తిరించడం, పిన్నులు కొట్టాల్సిన అవసరం ఉండదు. త్వరగా చినగదు, పైగా వాటర్‌ప్రూఫ్‌. భిన్న సైజుల్లోనూ దొరుకుతున్నాయి.

ఇక బుక్‌ ప్రొటెక్టివ్‌ కేస్‌లు... ఇవైతే మన పనిని మరీ సులువు చేసేస్తాయి. కత్తిరించడం, మడవడం లాంటి పనులే ఉంటాయి. పుస్తకం మాదిరే ఉంటాయి. పైపేజీలను ఇందులో ఇమిడేలా అమరిస్తే చాలు. ఊడటం, చినగడం లాంటి ఇబ్బందులేమీ ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్