ఆడవాళ్లూ వంతపాడితే ఎలా?

నాకు అనారోగ్య సమస్యలున్నాయి. గతంలో ఓ యాక్సిడెంట్‌ కూడా అయ్యింది. దీంతో విపరీతంగా లావయ్యా. నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తున్నారు. తోటి ఆడవాళ్లూ అందుకు వంత పాడుతున్నారు. ఇది నా పని మీదా ప్రభావం చూపుతోంది. పరిష్కారం చెప్పండి.

Published : 12 Jun 2024 16:50 IST

నాకు అనారోగ్య సమస్యలున్నాయి. గతంలో ఓ యాక్సిడెంట్‌ కూడా అయ్యింది. దీంతో విపరీతంగా లావయ్యా. నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తున్నారు. తోటి ఆడవాళ్లూ అందుకు వంత పాడుతున్నారు. ఇది నా పని మీదా ప్రభావం చూపుతోంది. పరిష్కారం చెప్పండి.

ఓ సోదరి

మీ పరిస్థితి బాధాకరం. పనిచేసే చోట ఇటువంటి మాటలు... మనల్ని మరింత నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలూ మన జీవితాల్ని శాసిస్తున్నాయి. ఒకవ్యక్తి రూపురేఖలు ఇలానే ఉండాలి, ఇలానే కనిపించాలనే ఇతరుల అభిప్రాయాలు మన జీవితాల్ని శాసించకూడదు. ఇప్పుడు బాడీ షేమింగ్‌ అనేది సాధారణం అయిపోయింది. మన సహోద్యోగులే అలా ఎగతాళి చేస్తుంటే చాలా అవమానంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇటువంటి కామెంట్లు చేస్తున్న వాళ్లతో ఎక్కువగా మాట్లాడకండి. మీ గురించి వాళ్లకు వివరించడానికీ ప్రయత్నించొద్దు. అసలు వాళ్లు ఏమంటున్నారో కూడా విననట్టు ఉండండి. అయినా కూడా ఇలాంటి కామెంట్లు మళ్లీ మళ్లీ చేస్తుంటే... ఇటువంటి మాటలు నచ్చవని వాళ్లకు తెలిసేలా గట్టిగానే సమాధానం ఇవ్వండి. వీళ్లేదో అన్నారు కదా అని మీరు ఏకాకిలానూ ఉండిపోవద్దు. జీవితం చాలా చిన్నది. ఇటువంటి మాటలు మిమ్మల్ని ఆపకూడదు. అందుకే మీ చుట్టూ అర్థంచేసుకునే మీ స్నేహితులు ఉండేలా చూసుకోండి. పరిణతి లేకుండా మాట్లాడే సహాద్యోగులతో వీలైనంత తక్కువగా మాట్లాడండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇదే కొనసాగితే... హెచ్‌ఆర్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ఇలాంటి మాటలు మన శారీరక, మానసిక ఆరోగ్యాలపైనా ప్రభావం చూపిస్తాయి. దానివల్ల పనిలో ఉత్పాదకతా తగ్గుతుంది. తద్వారా సంస్థకూ నష్టమే. అన్నింటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు అంగీకరించండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. అప్పుడే మీరు పనిలోనూ, జీవితంలోనూ విజయాలు సాధిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్