నుదుటి దగ్గర జుట్టు పోతోంది

మా అమ్మాయికి పదకొండేళ్లు. జుట్టు బాగా ఊడుతోంది. ముఖ్యంగా నుదురు దగ్గర్లో వెంట్రుకలు ఎక్కువగా రాలుతున్నాయి. పరిష్కారం చెప్పండి.

Published : 24 Jun 2021 01:27 IST

మా అమ్మాయికి పదకొండేళ్లు. జుట్టు బాగా ఊడుతోంది. ముఖ్యంగా నుదురు దగ్గర్లో వెంట్రుకలు ఎక్కువగా రాలుతున్నాయి. పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

ఏ ఆరోగ్య సమస్యా లేకుండా జుట్టు ఊడుతోంటే.. వంశపారంపర్యమని భావించొచ్చు. పిల్లల్లో నుదురు చిన్నగానే ఉంటుంది. పెరిగే కొద్దీ ఆ భాగం పైకి వెళుతూ ఉంటుంది. ఇది సాధారణమే. దాన్ని జుట్టు ఊడటంగా భావించం. కుటుంబంలో ఎవరికైనా జుట్టు పైకి ఉంటే.. పిల్లల్లోనూ అలా మారే అవకాశం ఉంటుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఐరన్‌, పోషకాహార లోపం కానీ, థైరాయిడ్‌ సమస్య కానీ ఉందేమో చూసుకోవాలి. ఎదిగే పిల్లల్లోనూ ఒత్తిడి ఉంటుంది. దాన్నీ చెక్‌ చేసుకోవాలి. రజస్వల అయితే పీసీఓస్‌ సమస్య ఉందేమో చూసుకోవాలి. మామూలుగా 50 -100 వెంట్రుకలు ఊడటం సాధారణమే. అంతకన్నా ఎక్కువగా ఉంటే వైద్యుణ్ని సంప్రదించాలి. ఒత్తిడి ఉందనిపిస్తే తగ్గించే ప్రయత్నం చేయాలి.

వాతావరణం అంటే.. ఎక్కువ వేడి/ చలిలో ఉన్నా, టైఫాయిడ్‌, మలేరియా, వైరల్‌ ఫీవర్‌ వచ్చి తగ్గినా జుట్టు ఊడుతుంది. ఐరన్‌, జింక్‌, విటమిన్‌ బి6, బి12 తగినంత అందుతున్నాయో లేదో చూసుకోవాలి. సంబంధిత పరీక్షలు చేయించొచ్చు. అన్నీ సరిగా ఉంటే కంగారు పడక్కర్లేదు. డ్రైయర్‌ వాడకం, స్ట్రెయిటనింగ్‌, గట్టిగా అల్లడం వంటివీ జుట్టు రాలడానికి కారణమవుతాయి. హార్మోన్లు మారుతున్నాయేమో కూడా చూసుకోవాలి. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా ఇస్తున్నారా పరిశీలించండి. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే చేపలు, నట్స్‌, ఐరన్‌, విటమిన్‌ డి2 ఉండే పాలకూర, గుమ్మడి, కొబ్బరిపాలు వంటివి ఇవ్వాలి. అవిసెలు, పొద్దు తిరుగుడు గింజలతోపాటు ఆకుకూరలు, క్యారెట్‌, గుడ్లనూ డైట్‌లో చేర్చండి. కూరగాయలు, పండ్లతో పాటు కనీసం 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి. ఒత్తిడి తగ్గించడంతోపాటు జుట్టు పెరిగేలా ఇది ప్రోత్సహిస్తుంది. వారానికోసారి నూనెతో తలను మసాజ్‌ చేస్తూ రసాయనాలు లేని షాంపూలను వాడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్