పాప సమస్య తగ్గాలంటే ఏం చేయాలి?

మీ పాప ఆహారంలో తగినంత పీచు, ద్రవపదార్థాలు ఉండేలా చూడాలి. చాలా మంది చిన్నారులు బిస్కెట్లు, కార్న్‌ ఫ్లేక్స్‌, నూడుల్స్‌, పెరుగన్నం... ఇలా తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇష్టపడుతుంటారు. వీటి నుంచి శరీరానికి కావాల్సిన పీచు లభించదు. దాంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి.

Published : 25 Jun 2021 01:47 IST

మా పాప వయసు అయిదేళ్లు. తనకు మలబద్ధకం ఉంది. గ్యాస్‌తోనూ బాధపడుతోంది. ఈ ఇబ్బంది తగ్గాలంటే ఆహారంలో ఏం మార్పులు చేయాలి?

- అంజలి, కృష్ణాజిల్లా

మీ పాప ఆహారంలో తగినంత పీచు, ద్రవపదార్థాలు ఉండేలా చూడాలి. చాలా మంది చిన్నారులు బిస్కెట్లు, కార్న్‌ ఫ్లేక్స్‌, నూడుల్స్‌, పెరుగన్నం... ఇలా తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇష్టపడుతుంటారు. వీటి నుంచి శరీరానికి కావాల్సిన పీచు లభించదు. దాంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా రోజుల నుంచి తగినంత పీచు పదార్థం శరీరానికి అందకపోవడం వల్ల జీర్ణాశయంలో మేలు చేసే బ్యాక్టీరియా సరైన మోతాదులో ఉండకపోవచ్చు. అంతేకాదు హానికారక బ్యాక్టీరియా చేరి దుర్వాసనతో కూడిన వాయువులు వెలువడతాయి. పీచున్న పదార్థాలు తీసుకోకుండా పాలు, పాల పదార్థాలను మాత్రమే తీసుకున్నప్పుడు ఈ మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. మేలైన పీచు పదార్థాల కోసం ఆహారంలో తప్పనిసరిగా పొట్టుతో ఉన్న గింజ ధాన్యాల వినియోగాన్ని పెంచాలి. ఇందుకోసం పొట్టుతో ఉన్న  ఓట్స్‌, మిల్లెట్స్‌తో చేసిన అల్పాహారాలను అందించాలి. ఆహారంలో ఒకపూటైనా పొట్టుతో ఉండే పిండి పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు మైదాపిండితో చేసినవి కాకుండా పొట్టుతోనే ఉన్న గోధుమ పిండిని వాడాలి. ఉడకబెట్టిన సెనగలు, అలసందలు, రాజ్మా లాంటివి తప్పకుండా వాడాలి. ప్రోబయోటిక్స్‌ పెంచే అరటికాయ, సగ్గుబియ్యం, ఉల్లిపాయలు, ఓట్స్‌, బార్లీ ఇస్తూండాలి. పీచు ఎక్కువగా ఉండే బెండకాయ, చిక్కుడు, వంకాయ, క్యారెట్‌, సజ్జలు, జొన్నలు, రాగులు, గోధుమ పిండి... ఇలా అన్నీ రకాలు చిన్నారికి తినిపించాలి. సరైన మోతాదులో ద్రవపదార్థాలు ఇస్తుండాలి. రోజుకు 100 గ్రా. చొప్పున పండ్లు, కూరగాయలు అలవాటు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్