వారానికి కిలో తగ్గగలనా?

నా వయసు 47. మెనోపాజ్‌ తర్వాత బరువు పెరిగా.  తిండి తగ్గించినా ఒళ్లు తగ్గడం లేదు.

Updated : 02 Jul 2021 06:33 IST

నా వయసు 47. మెనోపాజ్‌ తర్వాత బరువు పెరిగా.  తిండి తగ్గించినా ఒళ్లు తగ్గడం లేదు. ఉదయం ఓట్స్‌, మధ్యాహ్నం అన్నం, రాత్రిళ్లు కొర్రలు తింటున్నా. వారానికి కనీసం కేజీ బరువు తగ్గాలనుకుంటున్నా. సాధ్యమేనా?

- వరలక్ష్మి, తాడేపల్లిగూడెం

మెనోపాజ్‌ మొదలవడానికి ముందు నుంచే మహిళల్లో జీవ క్రియల వేగం తగ్గుతుంది. హార్మోన్లలోనూ మార్పులొస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అదనపు కొవ్వు వచ్చి చేరుతుంది. అలా పొత్తి కడుపు, పిరుదులు, తొడల్లో కొవ్వు పేరుకుపోతుంది. మీరు తీసుకుంటున్న ఆహారంతో వారంలో కేజీ బరువు తగ్గలేరు. ఎన్ని కిలోలు బరువు పెరిగారనే దానిపై కాకుండా శరీరంలో కొవ్వు నిల్వలు ఎంత పెరిగాయి? ఎక్కడెక్కడ వాటి పరిమాణం ఎంత ఉంది? కండరాల ఆరోగ్యం... ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి. నడుము కొలత మీద దృష్టి పెట్టాలి. శరీరంలో అంతర్గత అవయవాలపై కొవ్వు ఎక్కడెక్కడ ఎంత పేరుకుందో డెక్సాస్కాన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దాంతో ఎముకలు, కండరాల స్థాయులూ తెలుస్తాయి. మెనోపాజ్‌ పాజ్‌ దశ దాటిన తర్వాత బరువు తగ్గే క్రమంలో కచ్చితంగా కండశాతం తగ్గకుండా కేవలం కొవ్వు మాత్రమే తగ్గేలా చూసుకోవాలి. ఇందుకోసం పోషకాహార నిపుణుల సలహాతో ఆహార నియమ పట్టికను పాటించాలి. బరువు తగ్గడం కోసం ఆహారం మానేయకుండా తగినంత ప్రొటీన్‌ తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, స్కిమ్డ్‌ మిల్క్‌, మీగడ తీసిన పెరుగు తీసుకోవచ్చు. కండరాల పటుత్వాన్ని పెంచే స్ట్రెంత్‌ ట్రెయినింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు, యోగాసనాలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్