సమయం కేటాయించుకునేదెలా?

నేను చాలా నెమ్మదస్తురాలిని. ప్రతిదీ నెమ్మదిగా చేస్తాను. త్వరగా చేయాల్సివస్తే కంగారు పడతాను. ప్రస్తుతం చాలా పనులతో సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. మార్గం చెప్పండి.....

Updated : 06 Jul 2021 06:37 IST

నేను చాలా నెమ్మదస్తురాలిని. ప్రతిదీ నెమ్మదిగా చేస్తాను. త్వరగా చేయాల్సివస్తే కంగారు పడతాను. ప్రస్తుతం చాలా పనులతో సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. మార్గం చెప్పండి.

- ఓ సోదరి

రకమైన ఒత్తిడి సాధారణం. రోజులో.. పరిమిత గంటల్లో పనులను ఎలా పూర్తి చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి కొన్ని పద్ధతులను ఉపయోగించొచ్చు. ఉదాహరణకు ఈ పొమోడోరో టెక్నిక్‌.
ఇదో సమయ నిర్వహణ పద్ధతి. దీనిని 1980 చివర్లో ‘ఫ్రాన్సెస్కో సిరిల్లో’ రూపొందించారు. దీనిలో పని గంటలను మధ్యలో చిన్న విరామాలతో 25 నిమిషాల చొప్పున విభజిస్తారు. ప్రతి విరామాన్నీ ఒక పొమోడోరోగా వ్యవహరిస్తారు. అందుకు..

చేయాల్సిన పనుల జాబితా రాసుకోండి. టైమర్‌ను సిద్ధం చేసుకోండి.

25 నిమిషాల సమయాన్ని సెట్‌ చేసుకోండి. అలారం మోగే వరకూ ఒక పనిపైనే దృష్టిపెట్టండి.

సెషన్‌ పూర్తవగానే ఒక పొమోడోరో పూర్తయినట్లుగా గుర్తించాలి. దాంతోపాటు ఎంత పని అయ్యిందో కూడా నోట్‌ చేసుకోవాలి.

ఇప్పుడు 5 నిమిషాల విరామం.

ప్రతి నాలుగు పోమోడోరోస్‌ తరువాత దీర్ఘకాల అంటే 15-30 నిమిషాల విరామం. ఈ పద్ధతిలో 25 నిమిషాల స్ప్రింట్‌లు ప్రధానం. ఒక్కో పొమోడోరో పద్ధతినీ తర్వాత గమనించుకుంటే పనిలో ఎంతమేరకు పురోగతి ఉందో మీకే అర్థమవుతుంది. పైగా ఒత్తిడి, హడావుడీ తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్