అరికాళ్ల మంటలు తగ్గేదెలా?

ఎక్కువ శాతం కాళ్లలో నరాలు దెబ్బతింటే మంటలు వస్తుంటాయి. దీన్ని ‘న్యూరోపతి’గా చెబుతుంటాం. మధుమేహుల్లో తిమ్మిర్లు, మంటలు లాంటివి సాధారణంగానే కనిపిస్తుంటాయి. కాబట్టి ఓసారి చెక్‌ చేయించుకోండి. మూత్రపిండ సంబంధిత సమస్యలు, హైపో థైరాయిడిజం ఉన్నా, విటమిన్‌ బి12 తగ్గినా కాళ్ల మంటలొస్తాయి. వీటినీ చెక్‌ చేయించుకోవాలి

Published : 10 Jul 2021 01:07 IST

అరికాళ్లు మంటలొస్తున్నాయి. రాత్రిపూట కొబ్బరినూనె రాస్తున్నాను. ఫలితం లేదు. తగ్గే మార్గం చెప్పండి.

- ఓ సోదరి, పాల్వంచ

ఎక్కువ శాతం కాళ్లలో నరాలు దెబ్బతింటే మంటలు వస్తుంటాయి. దీన్ని ‘న్యూరోపతి’గా చెబుతుంటాం. మధుమేహుల్లో తిమ్మిర్లు, మంటలు లాంటివి సాధారణంగానే కనిపిస్తుంటాయి. కాబట్టి ఓసారి చెక్‌ చేయించుకోండి. మూత్రపిండ సంబంధిత సమస్యలు, హైపో థైరాయిడిజం ఉన్నా, విటమిన్‌ బి12 తగ్గినా కాళ్ల మంటలొస్తాయి. వీటినీ చెక్‌ చేయించుకోవాలి. విటమిన్‌ బి6 తగ్గినా ఈ సమస్య ఉంటుంది. కొందరిలో ఏవైనా మందులు వాడుతుంటే వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా కారణమవుతాయి. కరోనా తర్వాత విటమిన్‌ టాబ్లెట్ల వాడకం బాగా పెరిగింది. బి6ను ఎక్కువగా తీసుకున్నా, డయాబెటిస్‌కు తీసుకునే మెక్‌ఫామిన్‌ వంటి వాటివల్ల కూడా దీనికి ఆస్కారం ఉంటుంది. ఇన్ఫెక్షన్లూ కారణమై ఉండొచ్చు. పాదాలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోయినా, బేరియాటిక్‌ సర్జరీ చేయించుకున్నా ఇది కనిపిస్తుంది. ముందు మీ సమస్యకు కారణమేంటో గుర్తించి చికిత్స తీసుకోండి. విటమిన్‌ బి12 లోపం ఉంటే ట్యాబ్లెట్లు/ ఇంజెక్షన్ల ద్వారా తీసుకోవాలి. ఇవేమీ కాకపోతే ఎమిథ్రిఫైలిన్‌, ఎమిథ్రి టైలిన్‌, కార్బమజి పాయిన్‌ల్లో ఏదో ఒకటి సూచిస్తాం. ఫంగల్‌ కారణమైతే యాంటీ ఫంగల్‌ క్రీమ్‌, ట్యాబ్లెట్లను వాడాలి. మధుమేహులు పాదాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దెబ్బ తగిలినపుడు వెంటనే చికిత్స తీసుకోవాలి. రోజూ కాళ్లపై డ్రైస్కిన్‌, పగుళ్లు లాంటివి ఉన్నాయేమో చెక్‌ చేసుకుంటుండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్