వివక్ష బాధిస్తోంది... ఏం చేయాలి?

నేనో గ్రాడ్యుయేట్‌ని. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సాంకేతిక రంగంలో పనిచేస్తున్నా. అమ్మాయిల పట్ల చూపే వివక్ష బాధిస్తోంది. నా సహోద్యోగినులకూ ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.

Updated : 14 Jul 2021 01:31 IST

నేనో గ్రాడ్యుయేట్‌ని. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సాంకేతిక రంగంలో పనిచేస్తున్నా. అమ్మాయిల పట్ల చూపే వివక్ష బాధిస్తోంది. నా సహోద్యోగినులకూ ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదేమని అడిగితే మందలించి, మా విశ్వసనీయతనే అనుమానిస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు పంపేస్తున్నారు. ఒకామె సమస్యను ప్రస్తావిస్తోంది కానీ, ఏదైనా చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలో సలహా ఇవ్వండి.

- ఓ సోదరి, గుంటూరు

క మహిళగా, ఆమె మీ సాయాన్ని నిరాకరించడాన్ని నేనర్థం చేసుకోగలను. ఆమె కేవలం మీతో చర్చించాలనుకుంటోంది. మీరేదో చేయాలని ఆశించట్లేదు. ఈ లింగభేదాల గురించి పెద్దగా ఆలోచించకండి. ఆమె కేవలం చర్చించడానికే ఇష్టపడుతున్నపుడు దాన్ని గౌరవించండి. మీరేదైనా తొందరపడి చేస్తే ఆమెకు సమస్యగా మారొచ్చు. కాబట్టి, ఇంకో ఆప్షన్‌ ఏముందో చూద్దాం.

మీ సమక్షంలో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే దాన్ని తెలివిగా ఎత్తి చూపండి. ఉదాహరణకు- ఆమె సలహా/ సూచనను ఎవరైనా పట్టించుకో లేదనుకోండి. ‘ఆమె ఇందాక చెప్పిన దాని గురించి మరొకసారి విందామా?’ అనో ‘దీన్ని కొనసాగించే ముందు తన అభిప్రాయమేంటో ముందు విందామా’ అనో అనొచ్చు. అయితే ఈ విధానమూ అన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు. కొందరు గమనించి మీరు కావాలనే చేస్తున్నారని మీపై నెగెటివ్‌ అభిప్రాయానికీ రావొచ్చు. వాటికీ సిద్ధంగా ఉండాలి. వెనుక కామెంట్లు, మందలింపులు, పక్కన పెట్టడం వంటివి మహిళల కెరియర్‌లో పెద్ద అవరోధాలు. దీనిపై అవగాహన కల్పించడం, అందరూ సమష్టిగా పోరాడటం వంటివి చేసినపుడే సమస్య పరిష్కారమవుతుంది. కలిసి పోరాడటం ప్రధానాంశమిక్కడ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్