ముఖం మీద ఎందుకిలా?

నాది నార్మల్‌ చర్మం. ముఖం మీద మొటిమలు ఏవో ఒకటి చిన్నగా వస్తూనే ఉంటాయి. మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఏం చేయాలి?

Updated : 07 Aug 2021 13:21 IST

నాది నార్మల్‌ చర్మం. ముఖం మీద మొటిమలు ఏవో ఒకటి చిన్నగా వస్తూనే ఉంటాయి. మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి, ఖమ్మం

దీన్ని యాక్నే ఫామ్‌ ఎరక్షన్‌ అంటాం. కాలుష్యం, తీసుకునే ఆహారం, అలవాట్లు వీటిల్లో ఏదైనా కారణం కావొచ్చు. ముందు ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీటిని తాగేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులు, వ్యాయామాలకు ప్రాధాన్యమివ్వండి. మానసిక ఒత్తిడీ వీటికి కారణమవుతాయి. ఆ సమస్య ఉంటే తగ్గించుకునే మార్గాన్ని వెతుక్కోండి. ఇవన్నీ చేస్తున్నా సమస్య వస్తోందంటే ఎండలో వెళ్లేటపుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లా కావొచ్చు. కాబట్టి బయటకు వెళ్లేటపుడు కనీసం ఎస్‌పీఎఫ్‌ 30 ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పకుండా వాడాలి. వీటి పరిష్కారానికి యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎక్కువగా అందాలి. కాబట్టి స్కిన్‌ ప్రొడక్ట్‌ల్లో ఎ, సి విటమిన్లు, ఆహారంలో అదనంగా బి కాంప్లెక్స్‌, బి3, విటమిన్‌ డి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎండ, కాలుష్యం బారిన ముఖం పడకుండా స్కార్ఫ్‌, గ్లాసెస్‌, క్యాప్‌ వంటివి వాడాలి.

గుమ్మడి విత్తనాల్లోని ట్రేస్‌ మినరల్స్‌, జింక్‌, విటమిన్‌ సి ఆరోగ్యకరమైన చర్మకణాల రూపకల్పనతో పాటు డామేజ్‌ అయిన వాటిని రిపేర్‌ కూడా చేస్తాయి. గ్రీన్‌ టీ, తేనె, నట్స్‌లను రోజువారీ ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి. వీటిల్లోని విటమిన్‌ ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఫేస్‌ మాస్క్‌ల్లో ఆలివ్‌ ఆయిల్‌ కొన్ని చుక్కలు కలిపి రాసుకుంటే దద్దుర్లు రాకుండా ఉంటాయి. బ్రకోలీనీ తరచుగా తీసుకోవాలి. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను ముఖానికి రాసి కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. పెరుగులో విటమిన్‌ డి, కాల్షియం, ప్రోబయాటిక్స్‌, ప్రోటీన్‌లుంటాయి. పసుపు యాంటీ ఏజెనింగ్‌. వీటిని ఆహారంగా, పై పూతగా ఎలా వాడినా మంచిదే. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్‌ ఉంటాయి. సీజన్‌ బట్టి తీసుకుంటుండాలి. స్పైసీ, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బయటి నుంచి వచ్చాక మేకప్‌ తొలగించి ఐస్‌ క్యూబ్‌తో రుద్దాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ రాయాలి. సమస్య దూరమవడంతోపాటు మీరు కోరుకున్నట్లుగా కాంతిమంతమూ అవుతుంది.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్