అతని తీరు.. ఇబ్బందిపెడుతోంది!

నా సహోద్యోగి నాకన్నా 19 ఏళ్లు పెద్దవాడు. నాతో మొరటుగా/ అనాగరికంగా వ్యవహరించడమే కాకుండా ప్రతి దానికీ విమర్శిస్తున్నాడు. నా వస్త్రధారణ, జుట్టు వంటి వ్యక్తిగత అంశాలపై కామెంట్లు చేస్తుంటాడు. సీనియర్‌, బాగా పనిచేస్తాడు కానీ అతని తీరే ఇబ్బందిగా ఉంది. ఎలా వ్యవహరించాలో సలహా ఇవ్వరా?

Updated : 08 Sep 2022 16:02 IST

నా సహోద్యోగి నాకన్నా 19 ఏళ్లు పెద్దవాడు. నాతో మొరటుగా/ అనాగరికంగా వ్యవహరించడమే కాకుండా ప్రతి దానికీ విమర్శిస్తున్నాడు. నా వస్త్రధారణ, జుట్టు వంటి వ్యక్తిగత అంశాలపై కామెంట్లు చేస్తుంటాడు. సీనియర్‌, బాగా పనిచేస్తాడు కానీ అతని తీరే ఇబ్బందిగా ఉంది. ఎలా వ్యవహరించాలో సలహా ఇవ్వరా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

అమర్యాదకర ప్రవర్తన, సామాజిక నిబంధనల ఉల్లంఘన, అగౌరవం.. ఇలా అనేక రూపాల్లో ఈ మొరటుదనం ఉంటుంది. దీన్ని అనాలోచితంగా, దూకుడుగా, ఉద్దేశపూర్వకంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించడమనీ చెప్పొచ్చు. పనిచేసే చోట ‘ఆమోదయోగ్యమైన’ తీరు ఒక్కో రంగంలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు- రెస్టారెంట్‌లనే తీసుకుందాం. అక్కడి కిచెన్‌లో అరవడం, కొన్నిసార్లు నోరు జారడం వంటివి సాధారణం. కానీ అదే తీరు సంస్థల్లో ఆమోదం కాదు. కొన్నిసార్లు సంస్కృతుల్లోనూ వ్యత్యాసాలుంటాయి. ఉదా: జపాన్‌లో నోరు తెరిచి నవ్వడమనే సాధారణ అంశాన్నీ ఒప్పుకోరక్కడ. కాబట్టి.. సంస్థలో ‘ఇదంతా సాధారణమే’ అనిపించే వాటి గురించి తెలుసుకోవాలి.
ఆధిక్యాన్ని ప్రదర్శించడం, ఏదైనా పని చేయించడానికి తనదైన తీరును ఉపయోగించడం, గతంలో చేసిన దానికి ప్రతిచర్య.. వంటివన్నీ మొరటుదనం/ కఠినంగా వ్యవహరించడానికి కారణమవుతాయి. ఒత్తిడి, నిరాశ, చిరాకు వల్ల వచ్చే స్పందనా అయ్యుండొచ్చు. వాటిని స్వీకరించే స్థానంలో మీరు ఉండటంతో కోపం, బాధ సహజమే. దీన్ని మొదట్లోనే తుంచేయకపోతే పని ప్రదేశంలో ఇదంతా సాధారణమనే స్థితి ఏర్పడుతుంది. తీవ్రత ఇంకా పెరగనూవచ్చు. అలా కాకూడదంటే..

* తేలిగ్గా తీసుకోవద్దు. వదిలేయనూ వద్దు. లేదంటే ఎలా వ్యవహరించినా మీరేమీ చేయరనే సంకేతాన్ని ఇచ్చినట్లవుతుంది. అలా ప్రవర్తించిన వారితో నేరుగా మాట్లాడండి. తన ప్రవర్తన మీపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందో తెలియజేస్తూ మార్చుకోవాల్సిన అవసరాన్నీ ప్రస్తావించండి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం మర్చిపోవద్దు.
* ఆ వ్యక్తి తన ప్రవర్తన సరైనదే అని భావిస్తుండొచ్చు. కారణాన్ని వివరించే ప్రయత్నం చేస్తే అవకాశమివ్వండి. పూర్తిగా వినండి. అతని కోణాన్నీ పరిగణనలోకి తీసుకోండి. కానీ ఈ తీరు పునరావృతం కావొద్దని స్పష్టంగా చెప్పండి. అయినా మారకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికీ వెనకాడొద్దు. అవసరమైతే హెచ్‌ఆర్‌ విభాగం సాయాన్నీ కోరవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్