విటమిన్‌-డి లోపం తగ్గాలంటే...

నాకు 56 ఏళ్లు. ఈ మధ్య విపరీతంగా నడుము నొప్పి వస్తోంది. కాళ్లూ చేతులు బాగా లాగుతున్నాయి. వైద్యులను సంప్రదిస్తే విటమిన్‌-డి లోపమన్నారు. సప్లిమెంట్స్‌ వాడుతున్నా. వీటితోపాటు ఆహారంలో ఎలాంటి మార్పులు...

Updated : 06 Sep 2021 05:38 IST

నాకు 56 ఏళ్లు. ఈ మధ్య విపరీతంగా నడుము నొప్పి వస్తోంది. కాళ్లూ చేతులు బాగా లాగుతున్నాయి. వైద్యులను సంప్రదిస్తే విటమిన్‌-డి లోపమన్నారు. సప్లిమెంట్స్‌ వాడుతున్నా. వీటితోపాటు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడగలను?

- రేవతి, హైదరాబాద్‌

ర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు దాని నుంచి శరీరం విటమిన్‌-డిని తయారుచేసుకుంటుంది. ఆహారం ద్వారా కూడా కొంత ఈ పోషకం అందుతుంది. ఎండ నుంచి శరీరం గ్రహించిన విటమిన్‌-డి త్వరగా రక్తంలో కలిసిపోయి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది హార్మోన్‌లా కూడా పనిచేస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఆహారంలో డి!
మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజులో కాసేపైనా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే వ్యాయామం లేదా నడక రోజూ తప్పనిసరి. విటమిన్‌-డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. మాంసాహారులైతే చేప, కోడిగుడ్డులోని పచ్చసొన, లివర్‌.. లాంటివి తీసుకోవచ్చు. శాకాహారులైతే నువ్వులు, నెయ్యి, పాలు, పెరుగు, వెన్న, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, ఆకుకూరలు తీసుకోవచ్చు. వెన్నతీసిన పాలను వాడేవాళ్లు వైద్యుల సూచనల మేరకు విటమిన్‌-డి సప్లిమెంట్్స క్రమం తప్పకుండా కొనసాగించాలి. శరీరంలో విటమిన్‌-డి నిల్వలు పెరగడానికి కాస్త సమయం (దాదాపు మూడు నెలలు) పడుతుంది.

బరువు ఎక్కువగా ఉన్నవారిలో (శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారిలో) శరీరానికి వచ్చే విటమిన్‌-డి చాలావరకు కొవ్వులోనే ఉండిపోతుంది. శరీరం దాన్ని తన అవసరాలకు వాడుకోలేకపోతుంది. కాబట్టి బరువును నియంత్రించుకోవడం తప్పనిసరి. థైరాయిడ్‌, మధుమేహం ఉన్నవారిలో కూడా ఈ విటమిన్‌ లోపం కనిపించొచ్చు. అవసరమైతే సప్లిమెంట్స్‌ వాడాలి.  భవిష్యత్తులో కండరాలు ఆరోగ్యంగా,  ఎముకలు దృఢంగా ఉండాలంటే మాత్రం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చివరగా.. విటమిన్‌-డి ఫార్టిఫైడ్‌ పాలు, వంటనూనెలను క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్