ఒంటరి ప్రయాణం.. జాగ్రత్త ఎలా?

ఈ మధ్య ప్రమోషన్‌ వచ్చింది. దీని కోసం చాలా కష్టపడ్డా. సంస్థ నా పనిని గుర్తించినందుకు చాలా ఆనందించా. కొత్త బాధ్యతల్లో దేశంలోని బ్రాంచీలన్నింటికీ వెళ్లాల్సి ఉంటుంది. విమాన టికెట్లు, వసతి అన్నీ సంస్థే చూసుకుంటుంది. కానీ ఒంటరిగా పెద్దగా ప్రయాణించ లేదు. కాస్త భయంగా ఉంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

Published : 09 Sep 2021 01:22 IST

ఈ మధ్య ప్రమోషన్‌ వచ్చింది. దీని కోసం చాలా కష్టపడ్డా. సంస్థ నా పనిని గుర్తించినందుకు చాలా ఆనందించా. కొత్త బాధ్యతల్లో దేశంలోని బ్రాంచీలన్నింటికీ వెళ్లాల్సి ఉంటుంది. విమాన టికెట్లు, వసతి అన్నీ సంస్థే చూసుకుంటుంది. కానీ ఒంటరిగా పెద్దగా ప్రయాణించ లేదు. కాస్త భయంగా ఉంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

- రాజీ, బెంగళూరు


గేజీ, హ్యాండ్‌ బ్యాగు తేలిగ్గా ఉండాలి. తప్పనిసరి డెబిట్‌, క్రెడిట్‌ కార్డు మాత్రమే దగ్గరుంచుకోండి. డబ్బులు, కార్డులను రహస్య ప్రదేశాల్లో, చేతి ఖర్చులకు అవసరమైనవి తేలిగ్గా తీసుకునేలా పెట్టుకోవాలి. ఎక్కువ నగదునూ తీసుకెళ్లొద్దు. అపరిచితులతో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు చెప్పొద్దు. వాళ్లు నిజాయతీగానే అడిగినా మొదటి సారి కాదని అబద్ధమాడండి. ప్రయాణాన్ని, వెళ్లే మార్గాలు సహా ప్లాన్‌ చేసుకోవాలి. క్యాబ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో మాటిమాటికీ గూగుల్‌ మ్యాప్‌ తీయొద్దు. కానీ రూట్‌ మ్యాప్‌ను మాత్రం ట్రాక్‌ చేసుకోవాలి. విమానం దిగాక తచ్చాడటం, ఏదైనా తినడం, ఫోన్‌ కాల్‌, మెసేజ్‌లు చూడ్డంకోసం ఆగడం లాంటివి వద్దు. ఇవన్నీ మోసం చేయాలనుకునే వారి అవకాశాల్లాంటివి. ఖరీదైన, పర్యాటకురాలిగా కనిపించే దుస్తులు వేసుకోవద్దు. ఆభరణాలూ వద్దు. స్థానిక సంప్రదాయాలు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కలిసే ప్రయత్నం చేయండి. భద్రతాపరంగా పేరున్న హోటల్‌నే ఎంచుకోండి. కొన్ని ఒక అంతస్తంతా స్త్రీలకు కేటాయిస్తున్నాయి, పరిశీలించుకోండి. గ్రౌండ్‌ ఫ్లోర్‌కు పైన, లిఫ్ట్‌కు దగ్గరగా, ఎమర్జెన్సీ మార్గాలు, మెట్లకు దూరంగా ఉండే గదిని ఎంచుకోండి.

హోటల్‌లోనూ..  సంతకంలో ఇంటిపేరు బదులు మొదటి అక్షరం రాస్తే చాలు. హోటల్‌ పోస్ట్‌ కార్డుతోపాటు గది చూపడానికి మహిళా సిబ్బంది సాయం తీసుకోండి. కీ హోల్‌ ఉన్న దాన్ని ఎంచుకోండి. లోనికి వెళ్లాక మాస్టర్‌ కీతో తెరవడానికి వీల్లేకుండా డబుల్‌ లాక్‌ వేసుకోవాలి. బయట ‘డోంట్‌ డిస్టర్బ్‌’ బోర్డుంచాలి. ఇవన్నీ చేసే ముందు గదినోసారి పరిశీలించుకోవాలి. సురక్షితమని నిర్థరించుకున్నాక కిటికీలు సహా అన్నీ మూసేయండి. అనుమానమొస్తే సెక్యూరిటీ సాయం కోరడానికి వెనకాడొద్దు. ఎవరి భద్రత వారి పూర్తి బాధ్యత కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్