కారణాన్ని సరిగా వివరించేదెలా?

నా వైద్య పరిస్థితి గతంలో వృత్తిపరమైన పురోగతిపై నేరుగా ప్రభావం చూపింది. దీన్ని ఇంటర్వ్యూలో చెప్పడమెలా? గత సంస్థ నా శస్త్రచికిత్సలు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పని కేటాయించినా

Updated : 06 Oct 2021 04:44 IST

నా వైద్య పరిస్థితి గతంలో వృత్తిపరమైన పురోగతిపై నేరుగా ప్రభావం చూపింది. దీన్ని ఇంటర్వ్యూలో చెప్పడమెలా? గత సంస్థ నా శస్త్రచికిత్సలు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పని కేటాయించినా సకాలంలో పని పూర్తి చేయలేకపోయా. దీంతో శిక్షణ, కెరియర్‌లో పురోగతి తగ్గింది. ఫలితంగా ఆరేళ్లయినా చిన్న స్థాయిలోనే ఉండిపోయా. ఈ విషయం కొత్త సంస్థకీ అర్థమవుతుంది కదా! కాబట్టి ఇంటర్వ్యూలో తప్పక అడుగుతారు. ప్రశ్నలు పక్కదారి పట్టకుండా సమర్థంగా వివరించడమెలా?

- శ్రీజ, మచిలీపట్నం

మీ పరిస్థితి నాకర్థమైంది. ముందు సంభాషణలో వైద్య పరిస్థితిని తేకండి. మీరు ఆ ప్రస్తావన తీసుకురానంత వరకూ ప్రశ్నలకు ఆస్కారమే ఉండదు. ఆరేళ్లుగా మీరు చిన్న స్థాయిలోనే ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి, ఇది మీ ప్రొఫైల్‌పై వ్యతిరేకంగా ప్రతిబింబిస్తుందనేది మీ అభిప్రాయం. ఆ ఆలోచన మానేయండి. చాలా మంది ఏళ్లపాటు పదోన్నతే లేకుండా ఒకే హోదాలో పనిచేస్తుంటారు. చాలావరకూ సంస్థలో పురోగతి అవకాశాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి, ఆ సమయంలో మీరేం సాధించారో, మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే పనులేం చేశారో వాటిపై దృష్టిపెట్టండి. ‘సాధారణం కంటే తక్కువ పురోగతి’ అని భావించడం ఆపేయండి. దానికి కొలత ఎలా వేస్తారు? మీరు కొన్ని అభివృద్ధి అవకాశాలు, శిక్షణను కోల్పోయారు. మీకంటే మీ తోటివారిలో పరిజ్ఞానం, నైపుణ్యాలు ఎక్కువ అని ఎలా చెబుతాం? ఏమో.. మీ నైపుణ్యాలు, అనుభవం కొత్త సంస్థలో ప్రయత్నిస్తున్న హోదాకు సరిపోవచ్చేమో! కాబట్టి, ఆందోళనపడకండి. నాకు తెలిసినంతవరకూ మీరు ప్రస్తావించనంతవరకూ వాళ్లకు మీ వైద్య చరిత్ర తెలియదు. ఒకవేళ తప్పనిసరే అయితే.. గత, తాజా పరిస్థితులను నిజాయతీగా చెప్పండి. చేయలేకపోయిన వాటిపై దృష్టి పోనివ్వకుండా సాధించినవి ప్రస్తావించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్