ఇన్నాళ్లయినా పీరియడ్స్‌ రావట్లేదు!

నా పెళ్లై నాలుగేళ్లు. ఇద్దరు పాపలు. రెండూ సిజేరియన్‌ కాన్పులే.  మొదటి పాప పుట్టిన ఐదు నెలలకే నాకు పీరియడ్స్‌ వచ్చేశాయి. మా చిన్న పాపకు ఇప్పుడు పదకొండు నెలలు. ఇప్పటి వరకు నాకు నెలసరి మొదలవలేదు. ఇదేమైనా సమస్యా?

Updated : 30 Nov 2021 04:30 IST

నా పెళ్లై నాలుగేళ్లు. ఇద్దరు పాపలు. రెండూ సిజేరియన్‌ కాన్పులే.  మొదటి పాప పుట్టిన ఐదు నెలలకే నాకు పీరియడ్స్‌ వచ్చేశాయి. మా చిన్న పాపకు ఇప్పుడు పదకొండు నెలలు. ఇప్పటి వరకు నాకు నెలసరి మొదలవలేదు. ఇదేమైనా సమస్యా?

- రమ్య, ఇ-మెయిల్‌

కాన్పు జరిగిన తర్వాత నెల మొదలుకుని రెండేళ్లలోపు పీరియడ్స్‌ ఎప్పుడైనా మొదలు కావొచ్చు. ప్రతి కాన్పు తర్వాత నెలసరి మొదలయ్యే తీరు ఒకేలా ఉండాలని లేదు. సాధారణంగా పాలిచ్చినన్ని రోజులు (పాలిచ్చేటప్పుడు) నెలసరి మొదలుకాదు. దీన్ని ‘లాక్టేషనల్‌ ఎమినోరియా’ అంటారు. ఈ సమయంలో అండం విడుదలవదు. ఎందుకంటే నెలసరి రావడానికి అవసరమైన గొనడోట్రోఫిన్‌ హార్మోన్లు, పాల ఉత్పత్తికి అవసరమైన ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ రెండూ మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచే విడుదల అవుతాయి. ఒకరకం హార్మోన్లు తయారవుతున్నప్పుడు రెండో రకం చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అందుకని పాల ఉత్పత్తి జరుగుతున్నంత కాలం అండం విడుదలవడం కానీ నెలసరి రావడం కానీ జరగదు.

మీరు పాపాయికి ఇంకా పాలిస్తున్నారని అనుకుంటున్నా. ఒకవేళ పాలు ఇవ్వడం మానేసి రెండు మూడు నెలలు దాటి ఉంటే ఒకసారి డాక్టర్‌తో పరీక్ష చేయించుకోండి. నెలసరి రాకపోవడానికి హార్మోన్ల అసమతుల్యత లేదా గర్భాశయ సమస్యలు ఉన్నాయేమో పరీక్షిస్తారు. బిడ్డ ఆహారం కోసం పూర్తిగా తల్లి పాలపై ఆధారపడినంత కాలం గర్భం నిలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకట్రెండు శాతానికి మించి ఉండవు. అందుకే ఈ పద్ధతిని ‘లామ్‌’ (లాక్టేషనల్‌ ఎమినోరియా మెథడ్‌- ఎల్‌ఏఎమ్‌) అని కూడా వ్యవహరిస్తారు. బిడ్డ పాలు కాకుండా ఇతర ఆహారం కూడా తీసుకోవడం ప్రారంభిస్తుందో అప్పుడిక తిరిగి నెలసరి మొదలు కావడంతోపాటు గర్భం నిలిచే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మరోసారి గైనకాలజిస్ట్‌ను కలవండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్