ఉద్యోగానికి డబ్బులడుగుతోంది!

నాలుగేళ్లకుపైగా ప్రస్తుత హోదాలో పనిచేస్తున్నా. నా సహోద్యోగి మా బ్రాంచి హెచ్‌ఆర్‌ విభాగానికి అధిపతి, నాకు మంచి స్నేహితురాలు. కొన్ని ఉద్యోగాలకు ఎంపిక చేసే ముందు డబ్బులు తీసుకుంటుందని కొన్నేళ్లుగా పుకార్లున్నాయి. రుజువులు లేక నేను పట్టించుకోలేదు.

Updated : 05 Dec 2021 05:53 IST

నాలుగేళ్లకుపైగా ప్రస్తుత హోదాలో పనిచేస్తున్నా. నా సహోద్యోగి మా బ్రాంచి హెచ్‌ఆర్‌ విభాగానికి అధిపతి, నాకు మంచి స్నేహితురాలు. కొన్ని ఉద్యోగాలకు ఎంపిక చేసే ముందు డబ్బులు తీసుకుంటుందని కొన్నేళ్లుగా పుకార్లున్నాయి. రుజువులు లేక నేను పట్టించుకోలేదు. ఇటీవల నాకు తెలిసిన ఒకరు నా బ్రాంచిలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లను తను డబ్బులు అడిగినట్లు నా దగ్గర సాక్ష్యముంది. తెలియనప్పుడు సరే... తెలిశాక ఇబ్బందిగా అనిపిస్తోంది. ఏం చేయను?

 - రూపిణి, దిల్లీ

ధికారంలో ఉన్న వారి నిజస్వరూపాలు ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంటాయి. చిన్నదైనా పెద్దదైనా అవినీతి అవినీతే. మేనేజర్‌ లేదా సహోద్యోగి మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని తెలిస్తే, ఎదుర్కోవడం కొంచెం కష్టమైన పనే.  మీ దగ్గరున్న ఆధారం సరైనదో కాదో చెక్‌ చేసుకోండి. తప్పు చేసినట్లు మీకు బలంగా అనిపించినా పరిశోధించుకుని, ధ్రువీకరించుకోవడం ఎప్పుడూ మంచిది. కాబట్టి, ఒకటికి రెండు సార్లు రూఢీ చేసుకోండి. స్పష్టమైన అవగాహన వచ్చాక చేయాలనుకున్న దాని గురించి ఆలోచించండి. చాలామంది అనేక కారణాల వల్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతారు. ఉదాహరణకు - తననూ ఒకరు కార్నర్‌ చేసుండొచ్చు. దీంతో గత్యంతరం లేక ఇలా చేస్తుండొచ్చు.

ఏదైనా చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటే ముందు ఓపికగా సిద్ధం కండి. తనను దగ్గరగా పరిశీలించండి. అయితే ఒక్కోసారి మీకే ఎదురుదెబ్బ తగల గలదు, జాగ్రత్త. ముందు మీ సంస్థ సంస్కృతి, ఇలాంటి విషయాల్లో అధికారుల వైఖరి వంటివి తెలుసుకోండి. గతంలో ఇలాంటివేవైనా జరిగాయా? సంస్థ ఏ నిర్ణయం తీసుకుంది? రిపోర్ట్‌ చేయాలని నిర్ణయించుకుంటే ఎవరికి చేయాలి? మొదలైనవన్నీ చూసుకోవాలి. సరైన వ్యక్తినే ఎంచుకున్నారన్నప్పుడే విషయం బయటపెట్టండి. దాన్ని సమర్థించే పాలసీలు సంస్థకు ఉంటే.. మీకు సురక్షితమైన పని వాతావరణాన్ని అందిస్తుంది. వృత్తిపరమైన ప్రతికూలత నుంచీ మిమ్మల్ని రక్షిస్తుంది. మీ పేరు బయటికొచ్చినా మద్దతు ఇవ్వగలుగుతుంది. కాబట్టి, నిర్ణయం ఏదైనా జాగ్రత్తగా అడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్