ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?

ఉద్యోగంలో పదేళ్ల అనుభవం ఉంది. మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నా. కెరియర్‌లో ఎదగడానికి ఇదే సరైన మార్గమనిపిస్తోంది. నాకిద్దరు అమ్మాయిలు, నా భర్తకి ఎక్కువ ప్రయాణాలు చేయాల్సిన ఉద్యోగం. ఈ పరిస్థితుల్లో కష్టమని తెలుసు.

Updated : 29 Dec 2021 05:06 IST

ఉద్యోగంలో పదేళ్ల అనుభవం ఉంది. మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నా. కెరియర్‌లో ఎదగడానికి ఇదే సరైన మార్గమనిపిస్తోంది. నాకిద్దరు అమ్మాయిలు, నా భర్తకి ఎక్కువ ప్రయాణాలు చేయాల్సిన ఉద్యోగం. ఈ పరిస్థితుల్లో కష్టమని తెలుసు. కానీ ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ చేయలేననిపిస్తోంది. ఏం చేయమంటారు?

- వసుధ, కాకినాడ

ద్యోగంలో వృద్ధికి అప్‌గ్రేడింగ్‌ ఉత్తమ మార్గం. హోదాకు అవసరమైన దానికంటే ఎప్పుడూ రెండు అర్హతలు ఎక్కువగానే ఉండాలి. అయితే మహిళల విషయానికొచ్చేసరికి ఎన్నో అడ్డంకులు. నా సలహా మాత్రం ముందు వెళ్లి మాస్టర్స్‌లో చేరమనే! అయితే ముందీ అంశాలను చూడండి.

1. ఎంచుకున్న ప్రోగ్రామ్‌ మీ ప్రస్తుత షెడ్యూల్‌తో సరిపోతుందో లేదో చూసుకోండి. మీరు ఓ అమ్మ, ఇంకా ఉద్యోగం... రెండు బాధ్యతలూ ఉన్నాయి. కాబట్టి.. వారాంతాల్లో హాజరవడం, వర్చువల్‌ తరగతులు.. ఇలాంటి అవకాశాలేమైనా ఉన్నాయేమో చూసుకోండి.

2. మీ ఉద్దేశం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడమే అయితే.. విద్యారుణం వైపు వెళ్లకండి. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అవకాశాలను వెతుక్కోండి. కళాశాలలూ ఈ పరంగా సాయం చేస్తున్నాయి.

3. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ విద్యార్థిగా మారడం సులభం కాదు. దానికి కేటాయించాల్సిన సమయం, ఇటు బాధ్యతలు రెండింటినీ సమన్వయం చేసుకోగలరో లేదో చూసుకోవాలి. ఉన్నత విద్యలో చాలా సవాళ్లు ఉంటాయి. కానీ భయపడకండి. ఇది సాధారణం. మీకు మీరు ప్రత్యేకం, మల్టీటాస్కింగ్‌ చేయగలరని నమ్మితే చాలు. వీటన్నింటినీ సులభంగా అధిగమించేయొచ్చు. మీకేం కావాలో తెలుసుకొని, సరైన మనస్తత్వంతో సాగితే చాలు. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం పెరగడమే కాదు.. జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగానూ సిద్ధమవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్