అతని ప్రవర్తన దారుణం...

నా స్నేహితురాలు ఏడాదిగా ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది. ఇలాంటప్పుడు భర్త తనకు దూరంగా ఉండటమే కాదు, మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలిసింది. దీంతో ఆమె మానసికంగా మరింత కుమిలిపోతోంది. ఆసరాగా ఉండి ప్రేమను పంచాల్సిన

Updated : 06 Feb 2022 05:11 IST

నా స్నేహితురాలు ఏడాదిగా ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది. ఇలాంటప్పుడు భర్త తనకు దూరంగా ఉండటమే కాదు, మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలిసింది. దీంతో ఆమె మానసికంగా మరింత కుమిలిపోతోంది. ఆసరాగా ఉండి ప్రేమను పంచాల్సిన భర్త ఇలా ప్రవర్తించడం దారుణంగా అనిపిస్తోంది. అతనితో నేను మాట్లాడినా ఎలాంటి మార్పూ లేదు.

- ఓ సోదరి, హైదరాబాద్‌

* శారీరకంగా బాధపడుతున్న ఆమె భర్త ప్రేమ, ఆలంబన కోరుకోవడం సహజం. ఈ పరిస్థితిలో అతను తప్పనిసరిగా ఆదరణ చూపాలి. కానీ ఆమె అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంటే దయ, కరుణ లేని స్వార్థపరుడని అర్థమవుతోంది. అలాంటి వ్యక్తి గురించి ఆమె మనసు పాడుచేసుకునే కంటే తనను ఇష్టపడే తల్లిదండ్రులు, తోడపుట్టినవాళ్లతో ఆత్మీయంగా ఉంటూ దృఢంగా నిలబడాలి. తనకు ఇష్టమైన వ్యాపకాలతో కాలం గడపాలి. జబ్బు చేసినంతలో చనిపోతారని లేదు. ఆశావహ దృక్పథంతో వ్యాధిని అధిగమించాలి. ఎలాంటివాడో అర్థమైంది కనుక అతన్ని పట్టించుకోవడం మానేసి తన శ్రేయస్సు మీదే దృష్టిపెట్టాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందని గుర్తుచేసుకోవాలి. ఆత్మీయుల ఆసరాతో స్థైర్యంగా ఉంటూ జబ్బుతో పోరాడుతున్నట్లే ఈ విషయంలోనూ నిబ్బరంగా నిలబడి ఇష్టమైన విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్