మాంసాహారం మానేయాలా?

నా వయసు 43. బరువు 70 కిలోలు. ఈ మధ్య రాత్రి భోజనం తర్వాత విపరీతంగా పొట్ట ఉబ్బిపోతోంది. ఆయాసంగానూ అనిపిస్తోంది. మాంసాహారం కాస్త ఎక్కువగానే తింటా. సమస్య తగ్గాలంటే ఏం చేయాలి

Updated : 08 Feb 2022 04:59 IST

నా వయసు 43. బరువు 70 కిలోలు. ఈ మధ్య రాత్రి భోజనం తర్వాత విపరీతంగా పొట్ట ఉబ్బిపోతోంది. ఆయాసంగానూ అనిపిస్తోంది. మాంసాహారం కాస్త ఎక్కువగానే తింటా. సమస్య తగ్గాలంటే ఏం చేయాలి

శ్రీలత, విజయవాడ

* జీర్ణాశయంలో రకరకాల జీర్ణరసాలు, ఎంజైమ్‌లు ఆహారం జీర్ణమవడానికి తోడ్పడతాయి. ఎక్కువసేపు ఇవి పొట్టలో ఖాళీగా ఉండటం వల్ల వాటి మధ్య రసాయన చర్యలు జరిగి వాయువులు తయారవుతాయి. ఒకేసారి పెద్దమొత్తంలో ఆహారం తీసుకోవడంతో వాయువుల మీద ఒత్తిడి పడి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. శారీరక శ్రమకు దూరం, ఎక్కువ సమయం కూర్చొనే ఉండటమూ కారణమే. కొన్ని సందర్భాల్లో ఆమ్లాలు, జీర్ణరసాలు గొంతులోకి వచ్చి పుల్లటి తేన్పులు, గొంతుమంటకు కారణమవుతాయి. కాబట్టి, ఆహారాన్ని సమయానికి కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. తినగానే కాసేపు నడవాలి. రోజులో కనీసం అరగంట నడకకు కేటాయించాలి. మాంసాహారంలో పీచు అస్సలు ఉండదు. కొవ్వులు, ప్రొటీన్లు అధికం. అందుకే నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో పొట్ట బరువుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని తక్కువ నూనెతో వండుకోవాలి. రోజుకు 100 గ్రా. మించొద్దు. రోజూ కూరగాయలు, ఆకుకూరలు తప్పనిసరి. తృణధాన్యాలు, పొట్టు తియ్యని బియ్యం, జొన్నపిండి, రాగి పిండి, గోధుమపిండి ఓట్స్‌, బార్లీ, ఆకుకూరల సూప్‌, క్యారెట్‌, జామ, అరటిపండు, సపోటా.. వంటి పీచు ఎక్కువుండే వాటిని తీసుకోవాలి. వీటితోపాటు నీళ్లు సమృద్ధిగా తాగాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్