పొట్టలో పాపాయి... నేనేం తినాలి?

నా వయసు 34. ఎత్తు 5.4. బరువు 83 కిలోలు. ఆరు నెలల గర్భిణిని. సెర్విక్స్‌ చిన్నగా ఉందని కుట్లు వేశారు. వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నారు. శాకాహారిని. నేను బరువు పెరగకుండా, పొట్టలోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?  మీఎత్తుకు బరువును అన్వయిస్తే బీఎమ్‌ఐ కేటగిరి 30 కంటే ఎక్కువగా ఉంది. అంటే ఊబకాయం వర్గం. ఈ స్థితిలో గర్భిణిగా 5 నుంచి 9 కిలోలు మాత్రమే పెరగొచ్చు. అప్పుడే బిడ్డకూ, తల్లికి ఏ సమస్యలూ...

Updated : 26 Feb 2022 05:50 IST

నా వయసు 34. ఎత్తు 5.4. బరువు 83 కిలోలు. ఆరు నెలల గర్భిణిని. సెర్విక్స్‌ చిన్నగా ఉందని కుట్లు వేశారు. వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నారు. శాకాహారిని. నేను బరువు పెరగకుండా, పొట్టలోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? 

- ఓ సోదరి


మీఎత్తుకు బరువును అన్వయిస్తే బీఎమ్‌ఐ కేటగిరి 30 కంటే ఎక్కువగా ఉంది. అంటే ఊబకాయం వర్గం. ఈ స్థితిలో గర్భిణిగా 5 నుంచి 9 కిలోలు మాత్రమే పెరగొచ్చు. అప్పుడే బిడ్డకూ, తల్లికి ఏ సమస్యలూ రావు. కాలు కింద పెట్టొద్దన్నారు కాబట్టి శక్తినిచ్చే ఆహారం నియమిత మోతాదులో తీసుకోవాలి. అందులో బిడ్డ ఎదుగుదల, మీ ఆరోగ్యానికి కావాల్సిన ప్రొటీన్లు, ఐరన్‌, ఫోలిక్‌ ఆమ్లం, విటమిన్‌-ఎ, బి-కాంప్లెక్‌్్స విటమిన్లు, ఒమేగా 3 కొవ్వులు, పీచు, ద్రవపదార్థాలు ఉండాలి.

ప్రొటీన్ల కోసం... తక్కువ వెన్న శాతం ఉన్న పాలు, పనీర్‌, ఛీజ్‌ వాడుకోవచ్చు. రోజులో 200 - 300 మి.లీ. సరిపోతాయి. రోజూ దాదాపు 83 గ్రా., మాంసకృత్తులు అందేలా చూసుకోవాలి. ఒక పూట రాగితో చేసిన పదార్థాల్ని తీసుకుంటే క్యాల్షియం బాగా అందుతుంది. 100- 150 గ్రా., ఆకుకూరలు, ఉడికించిన కాయగూరలు 200- 300 గ్రా., సరిపోతాయి. వీటి నుంచి పీచు, విటమిన్లు, ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం, తక్కువ కెలొరీలు లభిస్తాయి. పిండిపదార్థాలు తక్కువగా ఉండే పండ్లు.. బత్తాయి, నారింజ, పుచ్చ, జామ, స్ట్రాబెర్రీలు, కివీలను తినొచ్చు. ఇవీ రోజులో 200 గ్రా., మించొద్దు. 6 చెంచాల నూనె చాలు. సోయా, రైస్‌బ్రాన్‌, ఆలివ్‌ లాంటి మేలైన నూనెలను వాడితే ప్రత్యేకంగా ఎండు ఫలాలు/ గింజలు అవసరం లేదు. భోజనంలో.. పాలిష్‌ బియ్యం, బ్రెడ్‌, మైదా కాకుండా... దంపుడు బియ్యం, చిరు ధాన్యాలు అయితే ప్రొటీన్లు లభిస్తాయి. రోజులో మూడు పూటలకు 200 నుంచి 250 ధాన్యాలు సరిపోతాయి. పప్పులు (90 గ్రా.,), సోయా నగ్గెట్స్‌ (20 గ్రా.,) లేదా రెండు మూడు ఎగ్‌వైట్స్‌ అదనంగా తీసుకుంటే ప్రొటీన్లకు సరిపోతాయి. పైవన్నీ పాటిస్తే బరువు పెరగరు.

ఇంకా... ఆకుకూరల సూప్‌లు, ఆకలేస్తే మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవచ్చు. మసాలాలు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. చిప్స్‌, తీపి బాగా తగ్గించాలి. ఆహారం కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తీసుకుంటే అసిడిటీ లాంటి సమస్యలు తలెత్తవు. నాణ్యమైన, తక్కువ కెలొరీలుండే ఆహారం తీసుకుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్