సమయం పెరిగి.. జీతం తగ్గింది!

కరోనా పరిస్థితి చక్కబడ్డాక మా సంస్థలో కొందరికి ఆఫీసు నుంచి, మరికొందరికి ఇంటి నుంచి పనిచేసే అవకాశమిచ్చారు. మొదటిసారి అప్రైజల్స్‌, జీతాల్లో పెంపు ప్రకటించారు. మా బృందంలో నాకే చాలా తక్కువ మొత్తం పెంచారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో అసలు

Published : 27 Jul 2022 00:17 IST

కరోనా పరిస్థితి చక్కబడ్డాక మా సంస్థలో కొందరికి ఆఫీసు నుంచి, మరికొందరికి ఇంటి నుంచి పనిచేసే అవకాశమిచ్చారు. మొదటిసారి అప్రైజల్స్‌, జీతాల్లో పెంపు ప్రకటించారు. మా బృందంలో నాకే చాలా తక్కువ మొత్తం పెంచారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో అసలు కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నా. అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. దీన్నెలా ఎదుర్కోను?

- రంజిత, బెంగళూరు

ప్రాక్సిమిటీ బయాస్‌గా వ్యవహరించే ఇది పని ప్రదేశంలో ఎక్కువగా కనిపిస్తోంది. సంస్థలకూ ఇది కొత్త అంశమే. ఎక్కువమంది ఇంటి నుంచి పనికే ఆసక్తి చూపిస్తుండటంతో సమాన పని, మానవ వనరుల కేటాయింపు విషయాల్లో సంస్థలూ ఇబ్బంది పడ్డాయి. దీంతో తెలియకుండానే రిమోట్‌గా పనిచేసే వారిపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితమే ఎవరో ఒకరిలా బలవుతున్నారు. పరోక్షంగా ముఖ్యమైన నిర్ణయాలు, పెద్ద ప్రాజెక్టులు, అధికారులతో కలవడం వంటి వాటికే కాకుండా పదోన్నతులు, నెట్‌వర్కింగ్‌ అవకాశాలకూ రిమోట్‌ విధానంలో పనిచేసే వారిని దూరంగా ఉంచుతున్నారు. ఇలాంటి పక్షపాత ధోరణికి పరిష్కారం.. సవాళ్లకు దూరంగా ఉండటం కాదు. వాటిని ఒక క్రమపద్ధతిలో పరిష్కరించుకుంటూ వెళ్లడమే. అలాగని అందరినీ ఆఫీసుకు రమ్మనడమూ సబబు కాదు. సరైన మార్గదర్శకాలు, పనివిధానాలను రూపొందించడం, ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు, తీసుకునే నిర్ణయాల్లో అందరినీ భాగం చేయడం వంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో హైబ్రిడ్‌ బృందాలు, రిమోట్‌-ఫస్ట్‌ కంపెనీల నుంచి నేర్చుకోవచ్చు. ఈ తరహా సంస్థలు అన్ని నిర్ణయాలు, ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతాయి. దీంతో ఏ విషయమైనా, ఏ సమయంలోనైనా అవగాహన తెచ్చుకునే వీలుంటుంది. బృందాలకీ నిర్ణయాలపై స్పష్టత వస్తుంది. మీటింగ్‌ల విషయంలోనూ ఆఫీసు, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగులందరినీ ఒక చోటకు తెస్తుంది. ప్రతిదానిలో కచ్చితమైన కట్టుబాట్లు విధించాలనుకోవు. సంస్థలన్నీ ఈ విషయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ తరహా పక్షపాతం ఒకటి ఉందని తెలుసుకొని సరైన మార్గాలను కనుక్కోవాలి. దానికి సమయం పడుతుంది. ఇక మీరు.. మీ మేనేజర్‌తో నేరుగా మాట్లాడండి. అప్రైజల్‌, జీతం పెరుగుదలపై ఎంత అసంతృప్తిగా ఉన్నారో కచ్చితంగా చెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్