ఆఫీసులో ఎలా ఉండాలి?

నా వయసు 30లోపు. నాతో పనిచేసే సీనియర్‌కి 45. ఆమె ఇటీవల ఓ జూనియర్‌ని ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత ‘ఈ తరం పిల్లల్లో మర్యాద, పని ప్రదేశంలో ఎలా ఉండాలనేవి తెలీడం లేదు’ అంది. నేనూ ఈతరం అమ్మాయినేగా!

Published : 24 Aug 2022 01:27 IST

నా వయసు 30లోపు. నాతో పనిచేసే సీనియర్‌కి 45. ఆమె ఇటీవల ఓ జూనియర్‌ని ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత ‘ఈ తరం పిల్లల్లో మర్యాద, పని ప్రదేశంలో ఎలా ఉండాలనేవి తెలీడం లేదు’ అంది. నేనూ ఈతరం అమ్మాయినేగా! అది వినగానే కాస్త ఇబ్బందిగా అనిపించింది. పని ప్రదేశంలో మర్యాద చూపిస్తూనే ప్రొఫెషనల్‌గా ఎలా నడచుకోవాలి?

- శ్రిద, బెంగళూరు

పనిచేసే చోట ఎలా నడుచుకోవాలనేదీ నేర్చుకోవడంలో భాగమే. అది నెమ్మదిగా అలవాటవుతుంది. మీరు ఈ అంశాలపై దృష్టిపెట్టండి.

* ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో దాన్ని ఆపడం, వినకపోవడం లాంటివి చేయొద్దు. మీ అభిప్రాయం చెప్పాలన్న తొందరొద్దు. చెప్పేది సాంతం వినండి. మీ ఆలోచనలను పంచుకోవడానికి ముందు ‘దీని గురించి మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?’ అని అడిగాకే కొనసాగించండి.

* ‘ప్లీజ్‌’, ‘థాంక్యూ’.. సహోద్యోగులు, మేనేజర్‌, కస్టమర్లు.. స్థాయి ఏదైనా సంభాషణల్లో అవసరమైన చోట వీటిని ఉపయోగించడం తప్పనిసరి.

* బాస్‌ను మెప్పించాలని సహోద్యోగులపై నిఘా వేయడం, వాళ్లపై ఫిర్యాదులు చేయడం లాంటివొద్దు. బాస్‌ను విమర్శిస్తూ పక్కవాళ్లతో అభిప్రాయాలు పంచుకోవడం లాంటివీ మంచిదికాదు. ఇతరుల పని, ఆలోచనలు, విజయాల్లో భాగం తీసుకోవాలన్న తాపత్రయం వద్దు.

* అందరి కంటే ముందు రావడం, ఆ తర్వాతే వెళ్లడం చేస్తేనే పనిచేస్తున్నట్లు కాదు. మీ పనివేళల్లో ప్రభావవంతంగా చేస్తే చాలు. మరీ అవసరమైతే తప్ప ఈ ధోరణికి అలవాటు పడకండి. ముఖ్యమైన విషయాలు, మీటింగ్‌లను మర్చిపోవడం మీ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. అలాంటివాటిని ఓ చోట రాసిపెట్టుకొని అయినా సమయానికి హాజరవ్వండి.

* మనవాళ్లతో ఫోన్‌ సంభాషణల్లో సమయం, స్వరంలో హెచ్చుతగ్గులను గమనించుకోం. అవి పక్కవాళ్లకి ఇబ్బందిగా తోయొచ్చు. అందుకే వ్యక్తిగత కాల్స్‌ను ఆఫీసు వేళలయ్యాక చూసుకోవడం మేలు. లేదూ మెసేజ్‌లు చేయడమో, పక్కకువెళ్లి మాట్లాడటమో చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్