లైంగిక వేధింపులపై కమిటీ ఎలా?

ఫార్మాస్యూటికల్‌ సంస్థలో ఆర్‌అండ్‌డీ విభాగంలో చేస్తున్నా. మేము పనిచేసే ప్రాంతంలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పనిలో చురుగ్గా ఉంటా. అందుకే మా బాస్‌ నన్ను మహిళల బాగోగులను

Published : 21 Sep 2022 00:21 IST

ఫార్మాస్యూటికల్‌ సంస్థలో ఆర్‌అండ్‌డీ విభాగంలో చేస్తున్నా. మేము పనిచేసే ప్రాంతంలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పనిలో చురుగ్గా ఉంటా. అందుకే మా బాస్‌ నన్ను మహిళల బాగోగులను పట్టించుకునే ఓ మహిళా కమిటీని రూపొందించమన్నారు. దాని సూచనల మేరకు గత రెండేళ్లుగా బడ్జెట్‌, ఇన్సెన్‌టివ్‌లనూ అందుకుంటున్నాం. తాజాగా లైంగిక వేధింపులపైనా ఓ కమిటీ ఉంటే బాగుంటుందని మా ఆలోచన. ఎలా చేస్తే బాగుంటుందో సూచించండి.

- అన్వితశ్రీ, కోల్‌కతా

సంస్థలో మహిళల బాగు కోసం మీకంటూ ఓ కమిటీని సాధించుకున్నందుకు అభినందనలు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆలోచించడమూ మంచి ఉద్దేశమే. సంస్థలూ ఉద్యోగినులకు సురక్షతను అందించే నియమ నిబంధనలను రూపొందిస్తున్నాయి. అయితే వాటిని సరిగా అమలు చేయకపోవడమే బాధాకరం. ఏదైనా సమస్య ఎదురైనా పట్టించుకోక పోవడమో, చూసీచూడనట్లు వదిలేయడమో చేస్తుంటారు. పైగా బాధితులదే తప్పు అన్నట్లు చూస్తారు. దీన్ని చాలా గోప్యంగా పరిష్కరించాలని ఉన్నా.. ఆవిధంగా అమలయ్యే అవకాశాలు చాలా తక్కువ. తమ సంస్థలో ఇలాంటి వాటికి ఆస్కారమే లేదని మేనేజ్‌మెంట్‌ బలంగా నమ్ముతుంది. అందుకే దీనిపై శిక్షణకూ పెద్దగా మొగ్గు చూపదు. దీంతో బాధితులకూ చట్టాలు, వాళ్లకున్న హక్కులపై అవగాహన ఉండదు. వీటిపై అవగాహన కల్పించాలి. ముందు ఆ కమిటీని ‘లైంగిక వేధింపుల నిరోధక కమిటీ’గా మార్పించండి. దానిలో ఉద్యోగినులు తరచూ మాట్లాడే సహోద్యోగుల నుంచి కాంట్రాక్టర్లు పై అధికారులు అందరినీ చేర్చాలి. కమిటీ మీటింగ్‌లను తరచూ నిర్వహించాలి. వచ్చిన సమస్యలు, వాటిని పరిష్కరించిన విధానాల్ని చర్చించాలి. వార్షిక నివేదికలనూ తయారు చేయాలి. కమిటీ తయారీ, శిక్షణలు ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ముందు మీలో కొందరు ఆ శిక్షణ తీసుకొని దాని ఆధారంగా పాలసీలను రూపొందించడం, కమిటీ రూపకల్పనలపై దృష్టి పెట్టండి. అవసరమైతే మార్పులు, చేర్పులకూ సిద్ధంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్