పెళ్లంటే భయమేస్తోంది!

ప్రశ్న: నా వయసు 28. ఎంఎన్‌సీలో ఉద్యోగం చేస్తున్నా. స్నేహితుల్లో కొందరు రిలేషన్‌షిప్‌లో ఉంటే, ఇంకొందరు బ్రేకప్‌తో బాధపడుతున్నారు. దాంతో నాకు పెళ్లంటే భయం పట్టుకుంది. ఒంటరిగా హాయిగా ఉండకుండా పెళ్లి అవసరమా అనిపిస్తోంది. కానీ ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది.

Published : 03 Oct 2022 00:57 IST

ప్రశ్న: నా వయసు 28. ఎంఎన్‌సీలో ఉద్యోగం చేస్తున్నా. స్నేహితుల్లో కొందరు రిలేషన్‌షిప్‌లో ఉంటే, ఇంకొందరు బ్రేకప్‌తో బాధపడుతున్నారు. దాంతో నాకు పెళ్లంటే భయం పట్టుకుంది. ఒంటరిగా హాయిగా ఉండకుండా పెళ్లి అవసరమా అనిపిస్తోంది. కానీ ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది.

- మాన్వి, హైదరాబాద్‌

సుఖదుఃఖాల్లో ఆలంబనగా నిలిచే వ్యక్తి అవసరం కనుక జీవితంలో పెళ్లి ముఖ్యం. ఇది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది. కుటుంబ స్థితిగతులు, సంప్రదాయాలు, ఆర్థిక, సామాజిక అంశాల్లో సమ స్థాయిలో ఉండేవారిని చూసి పెళ్లి చేయడం రివాజు. దానివల్ల ఇద్దరి మధ్యా అనుబంధం ఏర్పడుతుంది, కుటుంబాల మధ్య సహకారం ఉంటుంది. మారుతున్న కాలాన్ని బట్టి స్వేచ్ఛ, సొంత అభిప్రాయాలతో టీనేజ్‌లోనే రిలేషన్‌షిప్‌లోకి వెళ్తున్నారు. వారిలో కొందరు తమ మనస్తత్వానికి సరిపోతారా, పెద్దలు అంగీకరిస్తారా, అది పెళ్లి వరకూ వెళ్తుందా అని ఆలోచిస్తారు. ఇంకొందరు డేటింగ్‌ చేసి తమ మధ్య సయోధ్య లేదని తెలిశాక విడిపోతారు. తొందరపాటుతనం, తమ తప్పు గ్రహించకపోవడం, ఎదుటివాళ్లని నిందించడం, ప్రేమే తప్ప పెళ్లి అక్కర్లేదనుకోవడం, ఇంకొకరితో రిలేషన్‌ లాంటివి జరుగుతున్నాయి. పెళ్లి సున్నితమైన అంశమని గ్రహించకపోవడమే వీటికి కారణం. మీరు ఇతరుల సంబంధాలు చూసి భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోవాళ్లది ఒత్తిడి కాదు, తగిన వయసులో చేసుకోమని హితవు చెబుతున్నారు. వాళ్లని సంబంధాలు చూడమనండి. మీ మానసిక స్థితి, ఉద్యోగం, కుటుంబం, వాళ్ల సహకారం ఎలా ఉంటుంది- లాంటివన్నీ అమ్మానాన్నలనే అంచనా వేయమనండి. మీరు కూడా అతనితో మాట్లాడి అనుకూలం అనుకుంటే చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత అవగాహన, సర్దుబాటు గుణాలను బట్టి అనుబంధం ఉంటుంది. అంతే తప్ప ఇంకొకరి జీవితాల్ని బట్టి మీదీ అలానే ఉంటుందని, ఏ బంధమైనా అంతే, విడిపోక తప్పదు లాంటి ఊహలు వద్దు. అలా పెళ్లి మానుకుని.. వయసు దాటిపోయాక బాధపడేకంటే ఇప్పుడే జాగ్రత్తపడండి. ఒకవేళ మీ ఆలోచనలో మార్పు లేకపోతే సైకియాట్రిస్టును కలవండి. మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నాయా, అసలు కారణమేంటి అనేది చూస్తారు. కౌన్సెలింగ్‌తో మార్పు వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్