నా నంబర్‌ బ్లాక్‌ చేశాడు...

ఆరేళ్లుగా రిలేషన్‌లో ఉన్నా. అప్పుడప్పుడూ గొడవలైనా సర్దుకుని ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈమధ్య అతను నన్ను పట్టించుకోవడంలేదు.

Published : 10 Oct 2022 00:30 IST

ఆరేళ్లుగా రిలేషన్‌లో ఉన్నా. అప్పుడప్పుడూ గొడవలైనా సర్దుకుని ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈమధ్య అతను నన్ను పట్టించుకోవడంలేదు. పెళ్లి గురించి అడిగితే ‘లావుగా ఉన్నావు, ఇష్టంలేదు’ అన్నాడు. ఫోన్లు, మెసేజ్‌లూ వద్దంటూ నా నంబర్‌ని బ్లాక్‌ చేశాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడంలేదు. ఇన్నాళ్లూ అతనితో ఉండి ఇంకో వ్యక్తిని ఊహించడానికి సిద్ధంగా లేను. ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి!

- ఓ సోదరి

ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల మధ్య ఉండే బంధాన్ని మీ వరకే పరిమితం చేయబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం, గౌరవం, నమ్మకం ఉంటేనే బంధం పటిష్టమవుతుంది. మీది అలాంటిదా కాదా అనేది ముందే ఆలోచించాలి. బలపడటానికి ఇద్దరూ ప్రయత్నించాలి. పెళ్లిలోకి వెళ్లాలనుకున్నప్పుడు కుటుంబ    సభ్యుల ఇష్టాయిష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీకేం కావాలి, మీరెలా ఉండాలి, బంధం ఎలా పరిణమించాలి అనేవి ఆలోచించాలి. అవేమీ చేయకుండా పైపై మెరుగులకు లోనై కొట్లాడుకుంటూ గడిపారు. చిన్నచిన్న గొడవలు అంటున్నారు కానీ కాదు.. సరిపెట్టుకున్నారు. అతడికి ఈ బంధం పట్ల బాధ్యత కానీ, సీరియస్‌నెస్‌ కానీ లేవు. ఒక అవగాహన, అభిప్రాయం లేకుండానే కలిసున్నారు. ఇన్నాళ్ల తర్వాత మీ రూపాన్ని చులకన చేసి మాట్లాడుతున్నాడంటే మీ పట్ల మోజు పోయిందని తెలుస్తోంది. అతను మిమ్మల్ని పక్కన పెట్టినంతలో మీ జీవితం వృథా అనుకోవడం తెలివితక్కువతనం. దీన్ని ఇక్కడితో వదిలేసి చదువు, ఉద్యోగం, లక్ష్యాలను ఏర్పరచుకోండి. అమ్మానాన్నలు, ఇతర కుటుంబసభ్యులు, స్నేహితులతో బంధాన్ని బలపరచుకుంటే జీవితం మీద ఆశ కలుగుతుంది. ఆలంబన, ఆసరా దొరికి ధైర్యం వస్తుంది. ఏమైనా సాధించడానికి మార్గాలు తెలుస్తాయి. ఇంకా అతన్నే తలచుకున్నారంటే ఇంతకుముందు చేసిన చిన్న తప్పిదం మరింత పెద్దదవుతుంది. మీరొకసారి సైకియాట్రిస్టును కలవండి. అవసరమైతే మందులిస్తారు. ఒత్తిడిని అధిగమించడంలో మెలకువలు నేర్పిస్తారు. సమస్యను సర్దుబాటు చేసుకోవడం, పరిపక్వంగా ఆలోచించడం, జీవితాన్ని అందంగా మలచుకోవడంలో సలహాలూ సహకారం అందిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్