మహా పిసినారి.. మార్చేదెలా?

మేమిద్దరం ప్రైవేటు ఉద్యోగస్తులం. ఆయనకెప్పుడూ డబ్బు లెక్కలే. సినిమాలూ, షికార్లూ... ఏ సరదా లేదు. యంత్రాల్లా పనిచేసి పొదుపు చేయాలి. సొంత ఇల్లూ, బ్యాంక్‌ బ్యాలెన్సులూ ఉన్నా తృప్తి లేదు. ఇతన్ని మార్చేదెలా?

Published : 17 Oct 2022 00:28 IST

మేమిద్దరం ప్రైవేటు ఉద్యోగస్తులం. ఆయనకెప్పుడూ డబ్బు లెక్కలే. సినిమాలూ, షికార్లూ... ఏ సరదా లేదు. యంత్రాల్లా పనిచేసి పొదుపు చేయాలి. సొంత ఇల్లూ, బ్యాంక్‌ బ్యాలెన్సులూ ఉన్నా తృప్తి లేదు. ఇతన్ని మార్చేదెలా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

వ్యక్తుల స్వభావాలు భిన్నంగా ఉంటాయి. కొందరు అభద్రత, న్యూనతల వల్ల డబ్బు ఖర్చుపెట్టరు. అది పొదుపు, భద్రత అనుకుంటారు. భవిష్యత్తులో ఇబ్బంది ఉండదనే నమ్మకం, భరోసాతో... ప్రస్తుతం గురించి ఆలోచించరు. వాళ్లకి సంపాదించడం, దాచుకోవడమే తప్ప జీవితమంటే ఇచ్చిపుచ్చుకోవడం, ఉన్నదాన్ని అనుభవించడం, ఇతరులతో కలవడం, చిన్న చిన్న ఆనందాల కోసం వెచ్చించడం అనే ధోరణి రాదు. అతనా మాయలో ఉన్నందున మీరు మెల్లగా నచ్చచెప్పండి. ఆయనతో కలిసి వెళ్లడంలో మీకు తృప్తి ఉంటుందనీ, భవిష్యత్తు అవసరాలూ, ఇతరత్రా ఖర్చులూ, పొదుపూ వంటివాటికి తీసేయగా...మిగిలిన మొత్తంతోనూ సంతోషంగా గడిపే మార్గాలున్నాయని చెప్పండి. అయితే, ఇలాంటప్పుడు ఇంకొకరితో పోల్చకుండా సున్నితంగానే మీకోరికను వివరించాలి. చిన్న ఖర్చుతో మొదలుపెట్టి ఆనందాన్ని రుచి చూపండి. తర్వాత కొద్దికొద్దిగా పెంచి అతనూ ఆనందించేట్టు చేస్తే కొంత మార్పు వస్తుంది. ఖర్చు చేసినా అనుభవిస్తున్నామనే భావన కలుగుతుంది. అలా కుదరలేదంటే మీ అత్తమామలు లేదా మరెవరి మాట వింటాడో వారితో చెప్పించండి. లేదా బృందంగా వెళ్తే ఖర్చులు తగ్గుతాయి కనుక మీ కుటుంబానికి దగ్గరగా ఉండే బంధుమిత్రులతో కలిసి వెళ్లే మార్గం చూపండి. పద్ధతులేవీ పనిచేయకుంటే మీ ఆదాయంలో కొంత డబ్బు పొదుపు చేసి మీకు ఇష్టమైన అంశాలకు ఖర్చుపెడతానని చెప్పేయండి. ఏదేమైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి. అతను కూడా మీ అభిప్రాయాన్ని ఒప్పుకునేలా, అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్