బిర్యానీ తింటే గ్యాస్‌ ఇబ్బందిపెడుతోంది!

చిన్నప్పటి నుంచీ పల్లెటూరిలో పెరిగా. అక్కడ మాంసాహారం, మసాలా వంటకాలను ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తినేదాన్ని. కానీ, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ వచ్చినప్పటి నుంచి స్నేహితులతో కలిసి వండుకుంటున్నా.

Updated : 29 Feb 2024 15:52 IST

చిన్నప్పటి నుంచీ పల్లెటూరిలో పెరిగా. అక్కడ మాంసాహారం, మసాలా వంటకాలను ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తినేదాన్ని. కానీ, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ వచ్చినప్పటి నుంచి స్నేహితులతో కలిసి వండుకుంటున్నా. పని సులువుగా అయిపోతుందనీ, రుచి బాగుంటుందనీ... బిర్యానీ, బగారా రైస్‌ వంటివి ఎక్కువగా చేసుకుని తింటున్నాం. అలానే చికెన్‌ కూడా తరచూ ఉంటోంది. దీని వల్ల గ్యాస్‌ సమస్య వచ్చింది. నా బాధ చెబితే స్నేహితులు నవ్వుతున్నారు. నా వయసు ఇరవై రెండేళ్లు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?

- ఓసోదరి

ప్రతి ఒక్కరి జీర్ణవ్యవస్థా ఓ పద్ధతికి అలవాటు పడి ఉంటుంది. శరీరనిర్మాణం, అవయవాల పని తీరుని బట్టే దాని ఆరోగ్యం కూడానూ. మీకు మొదటి నుంచీ తేలికపాటి ఆహారం అలవాటు ఉండటం వల్ల ఒక్కసారిగా వచ్చిన మార్పులని స్వాగతించలేక శరీరం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే గ్యాస్‌ చేరడం, వాంతులూ, విరేచనాలు కావడం వంటి ఇబ్బందులు కనిపిస్తాయి. ఉద్యోగాలూ, చదువుల ఒత్తిడితో పని సులువుగా అవుతుందనో, రుచిగా ఉంటుందనో తరచూ వీటిని వండటం, అతిగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. మామూలుగా అయితే, అన్నం, చపాతీ, కూరగాయలు వంటి వాటిల్లో ఉండే పిండి పదార్థాలు తేలిగ్గా అరి గేందుకు సాయపడతాయి. మామూలుగా తినే వంటకాల్లో ఉప్పూ, కారం, ఇతరత్రా మసాలా పదార్థాలు కాస్త తక్కువే ఉంటాయి. కానీ, బిర్యానీ, పులావ్‌, బాగారా అన్నం వంటి వాటిల్లో నూనెలూ, నెయ్యి వాడకం ఎక్కువ. వీటికి అదనంగా మసాలాలూ, ఉప్పూ వంటివీ వచ్చి చేరతాయి. దాంతో జీర్ణప్రక్రియ మందగిస్తుంది. అది వేగవంతం అవ్వడానికి కడుపులో యాసిడ్లు విడుదలవుతాయి. అందుకు సూచికగా  త్రేన్పులు వస్తుంటాయి. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే రోజువారీ తీసుకునే ఆహారం పరిమితంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే కూర్చోవడం, నిద్ర పోవడం వంటివి చేయకూడదు. తిన్నాక కనీసం పదిహేను నిమిషాలు నడవగలగాలి. మసాలాలు, నూనెలు వంటివి తిన్నప్పుడు ఇది మరో ఐదు నిమిషాలు ఎక్కువ చేస్తే మరీ మంచిది. లేదంటే మీ కడుపులో చేరిన గ్యాస్‌ అల్సర్లకు దారి తీయొచ్చు. ఇతరత్రా అనారోగ్య సమస్యలకూ కారణం కావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్