అక్క చేసిన పనికి..

మా అక్క పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయింది. తనిప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. అప్పటి నుంచీ చుట్టుపక్కలవాళ్లు చులకనగా మాట్లాడుతున్నారు. నాన్న ఈమధ్యే అనారోగ్యంతో చనిపోయారు.

Updated : 05 Dec 2022 03:49 IST

మా అక్క పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయింది. తనిప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. అప్పటి నుంచీ చుట్టుపక్కలవాళ్లు చులకనగా మాట్లాడుతున్నారు. నాన్న ఈమధ్యే అనారోగ్యంతో చనిపోయారు. చిన్న ఉద్యోగం చేస్తూ అమ్మనీ, చెల్లెలినీ చూసుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే కుటుంబ పరిస్థితి ఏమిటో అర్థంకావడం లేదు.

- ఓ సోదరి

మీ అక్క పెళ్లయిన వ్యక్తితో వెళ్లిపోవడం అనేది తన నిర్ణయం. తన జీవితాన్ని తనకు నచ్చినట్లు మళ్లించుకుంది. ఆమె కుటుంబసభ్యురాలే అయినా అందుకు మీరేమీ చేయలేరు. కనుక ఆ బాధను మర్చిపోయి ఉన్నవాళ్లతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఇది వాస్తవికత. నాన్న లేనందున ఆ బాధ్యత మీరు మోస్తున్నారే తప్ప ఇరుగుపొరుగు వాళ్లు కాదు. కనుక మీ కుటుంబం గురించి ఎవరేమనుకున్నా మీకనవసరం. మీకేమీ సాయం చేయలేని సమాజం గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. మీ గురించి తపించేవారు ఏదైనా తప్పుపడితే ఆలోచిం చవచ్చు. సమాజంలో ఇలాంటివెన్నో జరుగుతుంటాయి. అవి కొంతకాలం వార్తలవుతాయి. మరో కొత్త విషయం రాగానే పాతవి మర్చిపోతారు. అందుకే ‘పబ్లిక్‌ మెమరీ ఈజ్‌ షార్ట్‌’ అంటారు. మీరు కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ఆ పని విలువైంది. చుట్టుపక్కలవారి మాటలతో బాధపడి కుంగిపోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం వరకూ రానీయొద్దు. మీ చెల్లెల్ని కూడా నిలదొక్కుకునేలా చేయండి. పెళ్లి చేసుకోబోయే ముందు అతనితో ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, భవిష్యత్తులో అమ్మా చెల్లెళ్ల బాధ్యత కొంత మీమీద ఉంటుందని చెప్పండి. వాళ్ల పట్ల మీకున్న ప్రేమ, సానుభూతి అతనూ పంచుకునేలా చూడండి. ఈ క్రమంలో మీరెంతో ధైర్యంగా ఉండాలి. మీకు ఆసరాగా నిలిచి, మీ వాళ్లను ఆదరించే వ్యక్తి దొరికితే మీకెంతో ఊరట లభిస్తుంది. చెల్లెలికి ఊతమివ్వడం వల్ల రేపు ఆమె కుటుంబం కూడా మీకు బాసటగా నిలుస్తుంది. అందరూ స్థిమితంగా, సంతోషంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్