ఆ ప్రేరణ పొందేదెలా?

20 ఏళ్ల పని అనుభవముంది. వచ్చే ఏడాది ముందస్తు పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నా. ఆ వచ్చే డబ్బులతో కొన్నాళ్లు హాయిగా గడపొచ్చు.

Updated : 21 Dec 2022 04:58 IST

20 ఏళ్ల పని అనుభవముంది. వచ్చే ఏడాది ముందస్తు పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నా. ఆ వచ్చే డబ్బులతో కొన్నాళ్లు హాయిగా గడపొచ్చు. జీవితాంతం డబ్బు ఇబ్బంది లేకుండా గడపాలంటే ఉద్యోగం తప్పదు. నాకేమో ఆసక్తి రావడం లేదు. ఏం చేయను? ఉద్యోగాన్ని కొనసాగించడానికి ప్రేరణ పొందే మార్గాన్ని చెప్పండి.

- లక్ష్మి, వరంగల్‌

మధ్య చాలా మంది సీనియర్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. వాళ్ల పనికి అందరిలా ప్రశంసలు దక్కక పోవడం, ఇతరులు పదవీ విరమణ చేసి హాయిగా ఉన్నారన్న భావన వస్తుండటంతో పనిచేయాలన్న ప్రేరణ కలగదు. నిజానికి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న అవగాహన దృష్ట్యా ఆసక్తి ఉంటే 70 ఏళ్లలోనూ కెరియర్‌ కొనసాగించవచ్చు. ముందు మీ మనసులో పాతుకుపోయిన అవరోధాలను తొలగించుకోవాలి. వయసు పెరిగేకొద్దీ.. ఉత్సాహం తగ్గనీయక.. నేర్చుకుంటూ, ఆడుతూ పాడుతూ పనిలో కొనసాగడానికి ప్రాధాన్యమిచ్చి చూడండి. ఇంకా..

* పనిలో అర్థాన్ని వెతకండి. మీ విలువలకు తగ్గ లక్ష్యాలను పెట్టుకొని సాధిస్తూ వెళ్లండి. మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకోవద్దు. రేపు ఇది సాధించాలంటూ నిద్రపోండి.. దాన్ని పూర్తిచేసే పట్టుదలతో నిద్ర లేవండి. మనసు, శరీరం ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోండి.

* చిన్నవాళ్లు.. జూనియర్లు అంటూ ఈ తరాన్ని పక్కనపెట్టొద్దు. మిమ్మల్ని అర్థం చేసుకునే వీలు కల్పించండి. వాళ్లతో కలిసిపోతే సృజనాత్మకత, ఊహాశక్తి, ఉపయోగం, పనిలో వేగం తగ్గిపోతాయన్న ఆలోచనలు దరిచేరవు. కొత్త ఉత్సాహంతో పనిచేయగలుగుతారు.

* విరామం తీసుకోవాలన్న ఆలోచనే నిస్సత్తువకు కారణం. 70, 80 ల్లోనూ పనిచేస్తున్న వారి గురించి తెలుసుకోండి. పదవీ విరమణ దశలో రాణిస్తున్న వారూ ఉన్నారు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకోండి.. ఏమో మీకే తెలియని శక్తి బయటపడి గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదుగుతారేమో! సానుకూలంగా ప్రయత్నించండి చాలు. ఇవన్నీ ప్రేరణ కలిగించేవే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్