గోధుమ రంగు.. మచ్చలేంటి?

దీన్ని పర్పురా పిగ్మెంటోజా, పిగ్మెంటెడ్‌ పర్పరిక్‌ డర్మటోసిస్‌ (పీపీడీ) అని అంటాం. వంశపారంపర్యంగా వస్తాయి. చాలా కొద్దిమందిలో ఎక్కువసేపు నిల్చొనే ఉండటం, అతి వ్యాయామం వంటి ఇతర కారణాల వల్లా వస్తుంటాయి.

Published : 22 Jan 2023 00:22 IST

తెల్లగా ఉంటాను. నా కాళ్ల మీద గోధుమ రంగులో సూదితో చేసినట్లుగా మచ్చలొస్తున్నాయి. సమస్యేంటి? తగ్గించుకునేదెలా?

- ఓ సోదరి

దీన్ని పర్పురా పిగ్మెంటోజా, పిగ్మెంటెడ్‌ పర్పరిక్‌ డర్మటోసిస్‌ (పీపీడీ) అని అంటాం. వంశపారంపర్యంగా వస్తాయి. చాలా కొద్దిమందిలో ఎక్కువసేపు నిల్చొనే ఉండటం, అతి వ్యాయామం వంటి ఇతర కారణాల వల్లా వస్తుంటాయి. చిన్నవయసులో ఏమీ కనిపించవు. 40 దాటాకే వస్తాయి. వీటివల్ల దురద, మంట వంటివి ఉండవు. మచ్చల్లా మాత్రమే ఉండిపోతాయి. వాటి వల్ల సమస్యేమీ ఉండదు. చర్మం మీద హిమోసిట్రిన్‌ చేరడం వల్ల వస్తాయి. ఇబ్బందయ్యే అవకాశాలు చాలా తక్కువ. కొంతమందిలో చాలా కొద్దిమొత్తంలో దురద ఉంటుంది. అలాగే దీనికి చికిత్సా ఏమీ లేదు. తక్కువ మొత్తంలో ఉంటే మాయిశ్చరైజర్‌, టాపికల్‌ స్టిరాయిడ్స్‌, యాంటీ హిస్టమిన్‌ వంటి క్రీములు వాడితే ఫలితం ఉంటుంది. వీటిని చూసి క్యాన్సర్‌ అని పొరబడుతుంటారు. కానీ కాదు. ఇది రావడానికి కారణాలేంటో చెప్పడమూ కష్టమే. ఎక్కువసేపు నిలబడటం, అతిగా వ్యాయామాలు చేసేవారిలో చర్మం కింది రక్తనాళాలు ఒరుసుకుపోవడం వల్ల అదీ కొందరిలో ఇలా కనిపిస్తుంటాయి. కాస్త దురద లాంటివి ఉంటే మైల్డ్‌ టాపికల్‌ స్టిరాయిడ్స్‌ వాడాలి. ఎక్కువగా ఉంటే మందులూ వాడాలి. ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి వైద్య పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్