అమ్మపై చిరాకుపడుతున్నాడు!

మా కుటుంబ సభ్యులందరూ ఓ ప్రమాదంలో చనిపోయారు. అమ్మా,  నేనే మిగిలాం. తను మా ఇంట్లోనే ఉంటోంది. మావారికి ఇది ఇష్టంలేదు.

Published : 23 Jan 2023 00:24 IST

మా కుటుంబ సభ్యులందరూ ఓ ప్రమాదంలో చనిపోయారు. అమ్మా,  నేనే మిగిలాం. తను మా ఇంట్లోనే ఉంటోంది. మావారికి ఇది ఇష్టంలేదు. అమ్మపై చిరాకు పడుతున్నాడు. తను మానసికంగా కుంగిపోయింది, మతిమరపూ ఎక్కువైంది. ఈ వయసులో తను సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి?

- ఓ సోదరి

నుకోని దుర్ఘటన జరిగి పిల్లలు చనిపోవడం అనేది ఆవిడ జీవితంలో పెద్ద దెబ్బ. అదొక తీరని లోటు. ఈ పరిస్థితిలో మీరు చూసుకోవడం మంచి పరిణామం. మీరు వ్యక్తిగత, సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు. మన సంప్రదాయంలో కూతురి దగ్గర ఉండటానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. మీ దగ్గర ఉండాల్సివచ్చినందుకు ఆమెకీ బాధగానే ఉంటుంది. దానికి తోడు మీవారు ఆవిడని పరాయి మనిషిలా చూస్తూ అయిష్టాన్ని వ్యక్తపరుస్తుంటే ఆమె మనసు మరింత గాయపడుతుంది. వయసు, పరిస్థితులను బట్టి ఆమె ఆందోళన చెందుతోంది. మతిమరపు పెరుగుతోందంటే అల్జీమర్స్‌ కూడా వచ్చిందని అర్థమవుతోంది. ఆమె అన్నీ మర్చిపోతుండటం వల్ల కూడా మీ వారికి విసుగు కలుగుతున్నట్లుంది. తన జ్ఞాపకశక్తి తగ్గిందన్న సంగతి ఆవిడకి తెలియకపోవచ్చు. డిమెన్షియాలో వాళ్ల ప్రవర్తన కూడా మారిపోతుంటుంది. ఏదేమైనా మీ భర్త మాటలను పట్టించుకోవద్దు. ఇక ముందు కూడా ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లల సహకారం తీసుకుని వాళ్లు ఆవిడతో ప్రేమగా ఉండేలా చూడండి. బాధ్యతలను సహనంగా నిర్వహించండి. ఆమె బతికున్నంత కాలం ఆలంబనగా ఉండటం, సంతోషంగా ఉంచడం మీ ధర్మం, కర్తవ్యం అని స్పష్టం చేయండి. అతను సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ ఆవిడ విషయంలో జోక్యం చేసుకోవద్దని, మానవతా దృక్పథంతో వ్యవహరించమని గట్టిగానే చెప్పండి. మీ వారి కోపాన్ని తట్టుకోవడం కష్టమే అయినా కన్నతల్లి బాధ్యత తప్పదు. ఈ వయసులో ఆవిడకి కావలసింది కాస్త తిండి, కొంచెం ప్రేమ.. అంతే కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్