పేలు పోవట్లేదు!

మా పాప వయసు ఐదేళ్లు. తనకు పేలు బాగా పడుతున్నాయి. విపరీతమైన దురదతో బాధపడుతోంది. ఏం చేసినా పోవడంలేదు. తగ్గే మార్గం చెప్పండి.

Updated : 29 Jan 2023 01:21 IST

మా పాప వయసు ఐదేళ్లు. తనకు పేలు బాగా పడుతున్నాయి. విపరీతమైన దురదతో బాధపడుతోంది. ఏం చేసినా పోవడంలేదు. తగ్గే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

వయసులో సహజమే. స్నేహితులతో దగ్గరగా ఉంటారు కాబట్టి, ఒకరి నుంచి మరొకరికి వస్తాయి. పేలు తలపై గాయం చేసి, రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి, దురద సహజమే. కొందరిలో ఒంటిపైనా కనిపిస్తుంటాయి. వీటి గుడ్లను తొలగించడం ఇంకా కష్టమైన పని. తువాలు, దువ్వెనలు, దిండ్లు, హెడ్‌ఫోన్ల ద్వారా వేరే వాళ్ల తలల్లోకీ చేరుతుంటాయి. పిల్లలకు తలలు తగిలేలా మాట్లాడుకోవద్దు, క్లిప్‌లు, హెయిర్‌ బ్యాండ్‌లు లాంటివి పంచుకోవద్దని చెప్పండి. పైరోథ్రిన్‌, పర్మిథ్రిన్‌ ఉన్న షాంపూలు వాడితే ఫలితం ఉంటుంది. అయినా తగ్గకపోతే వైద్యుల వద్దకు వెళ్లండి. ఓరల్‌ ఐవర్‌ మెక్టింగ్‌ అనే ట్యాబ్లెట్లను ఇస్తారు. రెండు డోస్‌లకు తగ్గిపోతుంది. చిన్నారులు కనీసం 15 కేజీలకు పైగా ఉన్నవారికే ఇవి. వైద్యుల సలహా తర్వాతే వాడాలి. మలాథియాన్‌ అనే క్రీమ్‌ను సూచిస్తుంటాం. అయితే ఇది రాస్తే వేడికి దూరంగా ఉండాలి. దీన్నీ రెండేళ్లలోపు వారికీ, గర్భిణులకీ సూచించం. బెంజైల్‌ ఆల్కహాల్‌, ఐవర్‌ మెక్టిన్‌ లోషన్‌లు దొరుకుతాయి. వాటిలో దేన్నైనా పది నిమిషాలు రాసి, కడిగేయాలి. తిరిగి వారం రోజులకు మరొకసారి రాస్తే సరి. తలస్నానం చేశాక, జుట్టు బాగా ఆరనిచ్చి సన్నటి పళ్లున్న దువ్వెనతో దువ్వితే పేలన్నీ రాలిపోతాయి. ఈ షాంపూ, లోషన్లు వాడాక అప్పటిదాకా పాప ఉపయోగించిన దువ్వెనలు, తువాలు, దుప్పట్లు, యాక్సెసరీలన్నింటినీ శుభ్రం చేయడం మర్చిపోవద్దు. ఇంట్లోవాళ్ల తలల్లో కొద్దిగా కనిపించినా వారూ ఉపయోగిస్తే సమస్య తిరిగొచ్చే అవకాశముండదు. పిల్లలనూ స్నేహితులతో మాట్లాడేప్పుడు, వస్తువులు పంచుకునేప్పుడు జాగ్రత్తగా ఉండమనండి. సమస్య ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్