వాదిస్తూనే ఉంటుంది!

మా పిన్ని కూతురు అన్నీ తనకే తెలుసనుకుంటుంది. అహంకారంతో ఎప్పుడూ ఎదుటివాళ్లతో వాదిస్తూనే ఉంటుంది. పైగా అదే గొప్పనుకుంటుంది. తనతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది. ఎందుకిలా ప్రవర్తిస్తుందో అర్థంకావడం లేదు. దీనికి మూడు కారణాలుంటాయి. ఒకటి తత్వం. చురుగ్గా ఉంటావు, తెలివైనదానివి, వాక్చాతుర్యం ఉంది, మంచి నిర్ణయం తీసుకుంటావు- అంటూ తోటివాళ్లు మెచ్చుకోవడంతో ఆత్మవిశ్వాసం ఎక్కువై అన్నీ తెలుసనుకుంటారు.

Published : 27 Feb 2023 00:24 IST

మా పిన్ని కూతురు అన్నీ తనకే తెలుసనుకుంటుంది. అహంకారంతో ఎప్పుడూ ఎదుటివాళ్లతో వాదిస్తూనే ఉంటుంది. పైగా అదే గొప్పనుకుంటుంది. తనతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది. ఎందుకిలా ప్రవర్తిస్తుందో అర్థంకావడం లేదు.

- ఓ సోదరి

దీనికి మూడు కారణాలుంటాయి. ఒకటి తత్వం. చురుగ్గా ఉంటావు, తెలివైనదానివి, వాక్చాతుర్యం ఉంది, మంచి నిర్ణయం తీసుకుంటావు- అంటూ తోటివాళ్లు మెచ్చుకోవడంతో ఆత్మవిశ్వాసం ఎక్కువై అన్నీ తెలుసనుకుంటారు. ఎదుటివారిని అంచనా వేయకుండా తామే గొప్పనుకుంటారు. అనుకున్నది నెరవేరడానికి ఎదుటివాళ్లను నిందిస్తారు. రెండోది పెంపకం. కొందరు తల్లిదండ్రులు గారాబం కొద్దీ పిల్లల్ని అదుపు చేయకపోగా వాళ్ల చేష్టలను ప్రోత్సహిస్తారు. దాంతో తమవి మంచి గుణాలే అనుకుంటారు. అదే అలవాటైపోతుంది. మూడోది వయసు, హార్మోన్ల  ప్రభావం. నెట్‌లో చూశాం, టీచర్‌ చెప్పింది అంటూ వాదిస్తారు. రుజువులున్నాయంటారు.

టీనేజీ వయసులో తల్లిదండ్రులు వ్యక్తిత్వపరంగా మార్పు తేవచ్చు. ఉపేక్షిస్తే క్లిష్టమవుతుంది. అలాంటి ప్రవర్తన వల్ల ఎదుటివారిలో న్యూనతాభావం కలగొచ్చు. ఎదురుతిరిగి బదులిచ్చే సమర్థత లేక బాధపడొచ్చు. కోపం, చిరాకు కలగొచ్చు. ఇదంతా అర్థం చేసుకుని వాళ్లు మారగలిగితే బాగుంటుంది. కానీ కొందరు చెప్పినా వినరు. వాళ్లని నియంత్రించేవాళ్లు వచ్చేవరకూ వాళ్లలా రెచ్చిపోతూనే ఉంటారు. ఇలాంటి వాళ్లు తమది సమస్య అనుకోరు. వీరికి బిహేవియరల్‌ థెరపీ కూడా పనిచేయదు. అందరూ వీళ్లని వదిలేసినప్పుడు నిస్సహాయ స్థితిలో పడి తప్పు గ్రహించి నప్పుడు కౌన్సెలింగ్‌ పనిచేస్తుంది. తమ స్వభావం నచ్చక ఇతరులు పట్టించుకోవడంలేదు, దూరంగా వెళ్లిపోతున్నారు అని గ్రహించి పశ్చాత్తాపం చెందితే కౌన్సెలింగ్‌తో మార్పు తేవచ్చు. తమను తాము అదుపుచేసుకునేలా సెల్ఫ్‌ కంట్రోల్‌ మెథడ్స్‌ నేర్పిస్తారు. బిహేవియరల్‌ మాడిఫికేషన్స్‌, సోషల్‌ స్కిల్స్‌ ట్రెయినింగ్‌లతో విపరీత ఆత్మగౌరవం నుంచి బయటపడేలా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్