తన తప్పేంటో.. చెప్పనా?

జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ని. అమ్మాయిలదే అయినా మగ కోచ్‌లు కూడా ఉంటారు. వాళ్లలో ఒకతను పూర్తిగా 20ల్లోపు అమ్మాయిలకే శిక్షణిస్తుంటాడు.

Published : 05 Apr 2023 00:03 IST

జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ని. అమ్మాయిలదే అయినా మగ కోచ్‌లు కూడా ఉంటారు. వాళ్లలో ఒకతను పూర్తిగా 20ల్లోపు అమ్మాయిలకే శిక్షణిస్తుంటాడు. న్యాయపరంగా ఎలాంటి తప్పూ చేయలేదు కానీ.. అతను శిక్షణిచ్చే తీరే చూసేవాళ్లకి అభ్యంతరంగా ఉంటుంది. క్లయింట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినా ఒక అమ్మాయిని తాకుతూ సూచనలిచ్చాడని మా బాస్‌ అతన్ని తొలగించారు. అయితే కారణం మాత్రం చెప్పలేదు. తనిప్పుడు వేరే జిమ్‌లో చేరాడు. అతనితో నాకు స్నేహం ఉంది. భవిష్యత్తులో తనకి ఇంకో సమస్య రాకుండా తన తప్పిదమేంటో చెప్పనా? అలా చెప్పడం మంచిదేనా?

- ఓ సోదరి

ఫిర్యాదు రాకుండానే ఒకరకమైన వేధింపులకు అడ్డుకట్ట వేసిన మీ బాస్‌ని మెచ్చుకోవాలి. ఇతని తీరు నచ్చక ఎంతమంది సమయాలను మార్చుకోవడం, స్నేహితులను పక్కకు తీసుకెళ్లడం చేశారో గమనించారా? అసలు మీ బాస్‌ ప్రారంభంలోనే పిలిచి అతను చేస్తోంది తప్పని హెచ్చరించాల్సింది. నిజానికి అతనికి చెడు ఉద్దేశం ఉండకపోయుండొచ్చు. తనకంటే పదేళ్లు చిన్నవాళ్లు కాబట్టి, పిల్లల్లా భావిస్తుండొచ్చు. మీ బాస్‌ ముందుగా ‘ఇలా ప్రవర్తించకూడదు.. చిన్నపిల్లలను తాకడం, చనువుగా ప్రవర్తించడం మంచిదికాదు. మహిళలకు మర్యాద పూర్వకంగా నేర్పించాలి’ అంటూ హెచ్చరించాల్సింది. కానీ కొద్దిరోజులు వేచి చూసి, నేరుగా తీసేశారు. అతనిక తన పద్ధతి ఎలా మార్చుకుంటాడు? నిజానికి అతని ప్రవర్తన అలాగే కొనసాగితే కొత్త ప్రదేశంలోనూ ఉద్యోగం పోగలదు. ఇతరులు నోటిమాటగా కొత్త బాస్‌కి విషయం చేర్చినా  ప్రమాదమే. అతను తెలియక చేస్తున్నాడు, చెబితే మారతాడు అనిపించిందా.. సలహా ఇవ్వండి. తోటి ఆడవాళ్లకు మంచి చేయాలనుకుంటారా.. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థలోనూ కొన్ని పాలసీలు తీసుకొచ్చేలా చూడండి. సేఫ్టీ పాలసీలు జిమ్‌ పరికరాలకే కాదు.. వినియోగదారులతో కోచ్‌ల ప్రవర్తన, బాధ్యత, పొరపాటు జరిగితే ఏ చర్యలు తీసుకుంటారు, సంస్థ ఉద్యోగులకుండే హక్కులు సహా వాటిలో ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. ఆ దిశగా ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్