తమ్ముణ్ణి మర్చిపోలేకపోతున్నా..

మా తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఇప్పుడు ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు పెళ్లై పిల్లలున్నా తనని మర్చిపోలేకపోతున్నా.

Updated : 10 Apr 2023 01:06 IST

మా తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఇప్పుడు ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు పెళ్లై పిల్లలున్నా తనని మర్చిపోలేకపోతున్నా. మేమీ బాధ నుంచి బయటపడేదెలా?

- ఒక సోదరి

కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లలు చాలా అన్యోన్యంగా ఉంటారు. దాంతో ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. అలాంటివారు ఇతరులతో కంటే కుటుంబీకులతోనే ఆత్మీయంగా ఉంటారు. అలా అన్నీ వారితోనే పంచుకోవడం, ఆధారపడే తత్వంతో ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అంతగా ఉండవు. అలాంటప్పుడు జరగకూడనిది జరిగితే ఇలాగే కష్టమవుతుంది. అయినవాళ్లు దూరమవడం బాధాకరమే. కానీ వారినే తలచుకుంటూ దుఃఖించకూడదు. అనుకోకుండా జరిగే విపత్తులు అందరితో కలిసిపోయేవారికి కూడా దుఃఖం కలిగించినా వాటి నుంచి త్వరగా బయటికొస్తారు. మీరు పెళ్లి చేసుకున్నారు కనుక మీ భర్త, పిల్లల మీద ప్రేమ చూపుతూ, వారి ప్రేమను పొందుతూ జీవనం సాగించాలి. అప్పుడు సహజంగానే ఈ బాధ తగ్గుతుంది. మీరు తమ్ముడి మీద విపరీతంగా ఆధారపడినందువల్లే ఇంతగా దుఃఖిస్తూ వెలితిలా భావిస్తున్నారు. చావు సహజమని, అది విషాదకరమే అయినప్పటికీ దాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుని బాధపడుతూ, బాధ్యతలను విస్మరించడం, ఇప్పటి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం సరికాదు. అందుకు భిన్నంగా దాన్ని అంగీకరించినప్పుడు బాధ తగ్గుతుంది. మనసు ఇతర విషయాల మీదికి మళ్లించాలి. జీవితం అంటే ఏమిటి, మనం ఎలా జీవించాలి లాంటి విషయాలు చదివితే మానసిక పరిపక్వత పెరుగుతుంది. ప్రశాంతత కలుగుతుంది. గతాన్ని తలచుకుంటూ కూర్చోక ప్రస్తుతంలో జీవించాలి. ఉన్నంతలో తృప్తిగా ఉండేందుకు, ఆనందంగా జీవించేందుకు ప్రయత్నించాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా నిబ్బరంగా ఉంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్