మళ్లీ ఫిర్యాదు చేయనా?

ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. నెల క్రితం మా మేనేజర్‌ సంస్థలో చట్టవిరుద్ధమైన పనిచేశారు. కార్మికుల చట్టాలకూ వ్యతిరేకమది. దీంతో డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌కి ఫిర్యాదు చేశా.

Published : 12 Apr 2023 00:48 IST

ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. నెల క్రితం మా మేనేజర్‌ సంస్థలో చట్టవిరుద్ధమైన పనిచేశారు. కార్మికుల చట్టాలకూ వ్యతిరేకమది. దీంతో డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌కి ఫిర్యాదు చేశా. ఇప్పుడు మళ్లీ అదే పనిచేస్తున్నాడు. మళ్లీ డిస్ట్రిక్‌ మేనేజర్‌కే ఫిర్యాదు చేయనా? పైవాళ్ల వద్దకు వెళ్లనా?

- ఓ సోదరి

ఫిర్యాదు చేసినా ఏ చర్యలూ తీసుకోలేదా? కార్మికుల చట్టాలకు సంబంధించి.. ఇంకా సంస్థ ప్రాంగణంలో జరిగిందంటున్నారు. పైగా చట్టవిరుద్ధమైన చర్య! అంటే ప్రభావం ఉద్యోగులు, సంస్థ రెండింటిపైనా చూపించే ప్రమాదం. బాస్‌కి ఫిర్యాదు చేసినా లాభం లేదు అంటున్నారు. కాబట్టి.. పైవాళ్ల దృష్టికి తీసుకెళ్లండి. అప్పుడే దానికి సరైన పరిష్కారం దొరుకుతుంది. లేదూ హెచ్‌ఆర్‌ వాళ్లనీ సంప్రదించొచ్చు. వాళ్లైతే కంపెనీ పాలసీలకు అనుగుణంగా ఏం చేయాలన్నది చెబుతారు. ఇంకా మీ గురించిన సమాచారాన్నీ బయటపెట్టరు. అయితే ఒత్తిడి, కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వాటికీ ధైర్యంగా ఉండాలి. అలాగే తగిన ఆధారాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. లేదంటే మీకే సమస్య. విషయం బయటపెట్టినందుకు మేనేజర్‌ నుంచీ ఇబ్బందులు ఎదురవొచ్చు. సరైన మార్గంలో నడవడం ఎప్పుడూ సులువు కాదని గుర్తుంచుకోండి. అవసరమైతే మీకు నమ్మకం ఉన్న వ్యక్తితో చర్చించి, ఎలా సాగాలన్న సలహాలు తీసుకుంటే ఇంకా మంచిది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యా అనిపించాకే ముందుకు అడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్