హైబీపీ... ఏం తినాలి?

నా వయసు ముప్పైఆరు. బరువు 65 కేజీలు. ఏడాది క్రితం అధిక రక్తపోటు సమస్య వచ్చింది. ఇంటి పని, ఆఫీసు ఒత్తిడితో సతమతమవుతున్నా. బరువు తగ్గి, బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార మార్పులు చేసుకోవాలి?

Published : 13 Apr 2023 00:07 IST

నా వయసు ముప్పైఆరు. బరువు 65 కేజీలు. ఏడాది క్రితం అధిక రక్తపోటు సమస్య వచ్చింది. ఇంటి పని, ఆఫీసు ఒత్తిడితో సతమతమవుతున్నా. బరువు తగ్గి, బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార మార్పులు చేసుకోవాలి?

- ఓ సోదరి

అధిక రక్తపోటుకు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం ప్రధాన కారణం. ఇది జన్యుపరంగానూ రావొచ్చు. మానసిక ఒత్తిడి, సమతుల్యత లేని ఆహారం తీసుకోడమూ కారణమే. మీరు ఉండాల్సిన బరువు కంటే ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నారు. జీవనశైలిని పద్ధతి ప్రకారం మార్చుకోగలిగితే అధిక బరువుతో పాటు రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. ముందుగా శరీరానికి కావాల్సిన పోషకాలను, కెలొరీలను ఒక పట్టిక ప్రకారం తీసుకోండి. వివిధ వ్యాయామ పద్ధతులతో బరువు తగ్గండి. ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, కారప్పొడులు, వడియాలు, అప్పడాలు, జంక్‌ఫుడ్‌లో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. అలా కాకుండా వీటన్నింటిని తగ్గించాలి. మన శరీరానికి కావల్సిన కాల్షియం సరిగా అందకపోతే కూడా రక్తపోటు పెరుగుతుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, రాగులతో చేసిన పదార్థాలు, ఆకుకూరలు తీసుకోవాలి. మెగ్నీషియం తగ్గినప్పుడు కూడా రక్తనాళాలు, కండరాల మార్పులు రావడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. ఇది గుమ్మడిగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఓట్స్‌, అవకాడో వంటివాటిలో సమృద్ధిగా లభిస్తుంది. ఇవే కాక విటమిన్‌ సి అధికంగా ఉండే నిమ్మజాతి పండ్లు, నువ్వులు, సోయా, నూనె గింజలు తీసుకోవాలి. పొట్టుతో ఉన్న పప్పులు, దంపుడు బియ్యం తాజాకూరగాయలు తినండి. వీటన్నింటితో పాటు మానసిక ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు చేస్తే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్