నా పనిలో ఇతరుల జోక్యాన్ని అడ్డుకోగలనా?

నేనో గ్రాఫిక్స్‌ నిపుణురాలిని. నాకెంతో అనుభవం ఉన్నా... మా బాస్‌ తీరు వల్ల అసంతృప్తి మిగులుతోంది. ముఖ్యంగా మా ఆఫీసులో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి బాస్‌ల భార్యల వరకూ అందరూ నా పనిలో జోక్యం చేసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వడం నాకు నచ్చడం లేదు.

Published : 19 Apr 2023 00:32 IST

నేనో గ్రాఫిక్స్‌ నిపుణురాలిని. నాకెంతో అనుభవం ఉన్నా... మా బాస్‌ తీరు వల్ల అసంతృప్తి మిగులుతోంది. ముఖ్యంగా మా ఆఫీసులో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి బాస్‌ల భార్యల వరకూ అందరూ నా పనిలో జోక్యం చేసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వడం నాకు నచ్చడం లేదు. ఇది నా చదువునీ, అనుభవాన్నీ వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టుకోవాలి.

- ఓ సోదరి

నం బాధ్యతవహించి పనిచేయాల్సిన చోట ఇతరుల అనవసర జోక్యాన్నీ, సలహాలను స్వీకరించాల్సి రావడం కష్టమే. ఈ పరిస్థితి మీకే కాదు... వృత్తి నిపుణులందరికీ ఎదురవుతూనే ఉంటుంది. ఈ విషయంలో కొంత వరకూ పరిధులు ఏర్పరుచుకోవచ్చు. అయితే, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో ఇది కాస్త కష్టం. ఎందుకంటే కళా రంగాల్లో నైపుణ్యం లేకున్నా, ఓనమాలు తెలియకపోయినా ఏం చేయాలి? ఎలా చేయాలో ప్రతి ఒక్కరూ సూచించగలరు. అలానే, బృంద సహకారంతో పని చేయాలనుకునే మీ బాస్‌ ఉన్నంత కాలం కూడా సహోద్యోగుల చొరబాటుని అడ్డుకోలేకపోవచ్చు. అయినా నిరాశపడొద్దు. కమర్షియల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేయడం మీ ప్యాకేజీలో ఓ భాగం. దాన్ని ఒత్తిడితో చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు బృందం నుంచి అయాచిత సహకారం తీసుకోవడం తప్పకపోవచ్చు. ముఖ్యంగా పై అధికారి ఈ విషయంలో పట్టుబడితే కాదన లేరు. అయితే, ఈ సమయంలో వినియోగదారుడి అభిప్రాయాలూ, అనుభవాలను దృష్టిలో పెట్టుకోవడం తప్పని సరి. దాన్ని కారణంగా చూపించి కొంత వెసులుబాటు తీసుకోవచ్చు. క్రియేటివ్‌ ప్రొఫెషనల్‌గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. ఇతరుల జోక్యాన్ని నియంత్రించాలనే ఆలోచనతో ఎక్కువ సమయం, శక్తిని వెచ్చించొద్దు. విజేత కావాలంటే ఎన్నో అంశాలను అర్థం చేసుకోవాలి. ప్రతి పనినీ ఇష్టపడి చేయగలగాలి. అప్పుడే అసంతృప్తిని అధిగమించొచ్చు. అయినా పరిస్థితి మెరుగు పడకపోతే సమస్యను మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లండి. సమయం ఎలా వృథా అవుతోంది? నాణ్యత ఎలా దెబ్బతింటోందీ వివరించండి. ఆవిడ ఎటువంటి మార్పులు చేయడానికి ఇష్టపడకపోతే... మీరు కఠినమైన నిర్ణయం తీసుకోవడానికీ వెనుకాడొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్