అందుకేనంటారా...

నాకు 32, మా ఆయనకు 36 ఏళ్లు. పెళ్లయ్యి ఆరేళ్లు దాటింది. ఇద్దరం ఉద్యోగస్థులమే. యాంత్రికత, ఇతరత్రా కారణాల వల్ల నెలకు ఒకటి, రెండుసార్ల కన్నా కలవలేకపోతున్నాం. పూర్తిస్థాయిలో సంతోషాలు పంచుకోలేకపోతున్నాం. ఈ వయసులో తరచూ కలవకపోతే శారీరక, మానసిక సమస్యలొస్తాయంటారు.

Updated : 24 Apr 2023 03:49 IST

నాకు 32, మా ఆయనకు 36 ఏళ్లు. పెళ్లయ్యి ఆరేళ్లు దాటింది. ఇద్దరం ఉద్యోగస్థులమే. యాంత్రికత, ఇతరత్రా కారణాల వల్ల నెలకు ఒకటి, రెండుసార్ల కన్నా కలవలేకపోతున్నాం. పూర్తిస్థాయిలో సంతోషాలు పంచుకోలేకపోతున్నాం. ఈ వయసులో తరచూ కలవకపోతే శారీరక, మానసిక సమస్యలొస్తాయంటారు. ఇది నిజమేనా? ఈమధ్య నాకు చాలా ఆయాసమొస్తోంది. ఆ కారణం వల్లేనా అని అనుమానం. దాంపత్యసుఖానికీ, ఆరోగ్యానికీ సంబంధముందా?

-ఓ సోదరి

వైవాహిక జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండటం, దాంపత్య సుఖం, పిల్లలూ ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. సెక్సువల్‌ యాక్టివిటీ జరిగినప్పుడు హ్యాపీ హార్మోన్లు విడుదలయ్యి శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని శాస్త్రీయంగానూ రుజువైంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే శారీరక బంధం ఉండాలి, తద్వారా ఆనందించాలి అనుకుంటే- భార్యాభర్తలిద్దరూ అందుకు సంసిద్ధం కావాలి. ఇద్దరిలో ఒకరు మానసికంగా సిద్ధంగా లేకున్నా, శారీరకంగా అలసిపోయినా ఆనందించలేరు. మీరు అప్పుడప్పుడూ కలిసినా.. దాన్ని ఆనందిస్తుంటే ఒకసారి, రెండుసార్లు అంటూ లెక్కలు వేసుకోనక్కర్లేదు. అనుకూలించకున్నా తప్పనిసరిగా కలవాలని ప్రయత్నించి.. అది సవ్యంగా సాగకపోతే భయం, బాధ, నిరాశ, నిరుత్సాహం మిగులుతాయి. కనుక తప్పనిసరి అనుకోవద్దు. ఇద్దరికీ ఇష్టం, కోరిక ఉండాలేగానీ.. ఇన్నిసార్లు కలవాలన్న నియమమేం లేదు. ఇక మీకు ఆయాసం వస్తోందంటే.. ‘ఎక్కువసార్లు కలవడంలేదు, ఇది సరికాదేమో, ఎలా చేస్తే మంచిదో, దానివల్ల అనారోగ్యం పాలవుతామేమో..’ లాంటి మీ నెగెటివ్‌ ఆలోచనలు, భయాలే కారణం. మనసు అశాంతి, ఆందోళనలతో నిండినందున ఆయాసం వస్తున్నట్టో నీరసంగా ఉన్నట్టో అనిపిస్తోంది. ఉద్యోగం వల్లా మీలో ఒత్తిడి ఉన్నట్టు అనిపిస్తోంది. ఒకసారి దంపతులు ఇద్దరూ వెళ్లి మానసిక నిపుణుడిని కలవండి. అవసరమైన కౌన్సెలింగ్‌ ఇస్తారు. పర్సనల్‌, టైం మేనేజ్‌మెంట్‌ వంటివీ నేర్పుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్