ఆఫీసుకు రమ్మంటున్నారు

ఇంటి నుంచి పనిచేసే అవకాశమనే తాజా సంస్థలో చేరా. తీరా ఇప్పుడు వారంలో మూడు రోజులు ఆఫీసుకు రమ్మంటున్నారు. హెడ్‌ ఆఫీసులో అమలైంది.

Updated : 26 Apr 2023 05:13 IST

ఇంటి నుంచి పనిచేసే అవకాశమనే తాజా సంస్థలో చేరా. తీరా ఇప్పుడు వారంలో మూడు రోజులు ఆఫీసుకు రమ్మంటున్నారు. హెడ్‌ ఆఫీసులో అమలైంది. మా బ్రాంచీలోనూ అమలు చేస్తారట. ప్రయాణానికే 45 నిమిషాలు పడుతుంది. నా ఆఫర్‌ లెటర్‌లో ‘రిమోట్‌ వర్కింగ్‌’ అనే ఉంది. అసలు ఉద్యోగానికి ఒప్పుకొన్నదీ ఇంట్లోంచి పని చేసే వీలుందనే! ఇప్పుడేం చేయాలి?

- నితీక్ష, హైదరాబాద్‌

రిమోట్‌ వర్కింగ్‌లో ఇబ్బందులు ఎదురవడమో లేదా సంస్థ ఈ విధానాన్ని కొద్దిరోజులే కొనసాగించాలని ముందుగానే అనుకోవడమో కారణమై ఉండొచ్చు. ఇంకా.. మీ సంస్థ ఆర్థిక ఒత్తిడి ఏమైనా ఎదుర్కొంటోందేమో. పెద్ద సంస్థలన్నీ అందుకే లేఆఫ్‌లు విధిస్తున్నాయి కూడా. కొన్ని సంస్థలకు అదీ అసాధ్యమే. దీంతో ఉద్యోగులను ఇబ్బందిపెట్టే ఇలాంటి చర్యలకూ పాల్పడుతుండొచ్చు. కాబట్టి.. ముందు మీరు కొన్ని సంగతులు గమనించాలి. ఒకటి.. ఆఫర్‌ లెటర్‌ న్యాయపరంగా మీకు సాయపడదు. యాజమాన్యాన్నీ ‘కచ్చితంగా రిమోట్‌ వర్కింగే ఇవ్వండ’ని బలవంతమూ చేయలేరు. కాబట్టి, మీ పైవాళ్లు, హెచ్‌ఆర్‌ వాళ్లతో మీ ఇబ్బందిని చెప్పి ప్రస్తుత విధానమే కొనసాగించగలరేమో కనుక్కోండి. లే ఆఫ్‌లు కాదు కాబట్టి, ఉద్యోగాన్ని వదులుకున్నా సంస్థ నుంచి ఎలాంటి మొత్తమూ రాదు. అసలే తొలగింపుల కారణంగా పెరుగుతున్న ఉద్యోగులూ వేలు, లక్షల్లోనే. వేరే కొలువు వెతుక్కుందామన్నా ఆ పోటీ తట్టుకోగలరా అన్నదీ పరిశీలించుకోవాలి. అయినా ‘ఆఫీసుకి రండి’ అనగానే వెంటనే అమలైపోదు. దానికీ కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌నే తీసుకోండి. ముందు ఉద్యోగులందరూ ఆఫీసుకు రావాలని నిబంధన పెట్టినా.. తర్వాత రిమోట్‌ ఆప్షన్‌ ఇచ్చారు. మీ సంస్థా ఉద్యోగుల స్పందన చూడాలనుకుంటోందేమో! కాబట్టి, తొందర పడకండి. పైవాళ్లతో మీకున్న ఆప్షన్లను చర్చించండి. అనుమానంగా తోస్తే ఇతర అవకాశాలనూ ప్రయత్నించండి. సరైనది దొరికితేే ఈ ఉద్యోగాన్ని వదిలేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్