సహజ సువాసనలెలా?

డియోడరెంట్లు, పెర్‌ఫ్యూమ్‌లంటే ఇష్టం. కానీ వాటిలోని రసాయనాల వల్ల చర్మానికి హాని అని భయం. సహజ ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? అసలు డియోలు, పెర్‌ఫ్యూమ్‌లు ఎంచుకునేప్పుడు ఏం గమనించుకోవాలి?

Published : 07 May 2023 00:21 IST

డియోడరెంట్లు, పెర్‌ఫ్యూమ్‌లంటే ఇష్టం. కానీ వాటిలోని రసాయనాల వల్ల చర్మానికి హాని అని భయం. సహజ ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? అసలు డియోలు, పెర్‌ఫ్యూమ్‌లు ఎంచుకునేప్పుడు ఏం గమనించుకోవాలి?

- ఓ సోదరి

డియోను దుర్వాసన తగ్గించడానికి, పెర్‌ఫ్యూమ్‌ను శరీరానికి సువాసనలు అద్దడానికి వాడతాం. డియో వాడకం ఎక్కువైతే తలనొప్పి, శ్వాస, గుండె సమస్యలొస్తాయి. దీనిలోని అల్యూమినియం క్లోరో హైడ్రేట్లు చర్మ సమస్యలు, క్యాన్సర్‌కీ, ట్రైక్లోసాన్‌ పీసీఓఎస్‌, హార్మోనుల్లో అసమతుల్యతకు దారితీస్తాయి. కాబట్టి, సహజమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి ఎక్కువ సువాసనలు ఇవ్వకపోయినా తాజా అనుభూతిని ఇస్తాయి. ముప్పావు కప్పు కొబ్బరి నూనెకు పావుకప్పు చొప్పున బేకింగ్‌ సోడా, కార్న్‌ఫ్లోర్‌, 6-10 చుక్కలు ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి బాహుమూలల్లో రాయాలి. 10 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇది సహజ డియోగా పనిచేస్తుంది. ఇక పెర్‌ఫ్యూమ్‌లు.. వీటి తయారీకి 2500 రకాల పదార్థాలను వాడతారని అంచనా. వీటిల్లో ఎవరికి ఏది పడదో చెప్పడం కష్టం. పడకపోతే దురద, ఆస్తమా, అలర్జీలు, కళ్లు తిరగడం, వాంతులు వంటివి కనిపిస్తుంటాయి. తలేట్స్‌, స్టైరీన్‌, గెలాక్సలైడ్‌ కీటోన్‌, మస్క్‌ కీటోన్స్‌, ఇథలిన్‌ గ్లైకాల్‌, ఆక్సిబెంజోన్‌ వంటివాటితో గర్భిణులకు ప్రమాదం కూడా. వాళ్లు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. 4-5 చుక్కల ఎగ్జోటిక్‌ ఆయిల్‌, 1-2 చుక్కల చొప్పున నిమ్మ, నారింజ రసం కలిపి పెర్‌ఫ్యూమ్‌లా రాసుకోవచ్చు. 2 చుక్కల మల్లె, చుక్క చొప్పున గంధం, ఎగ్జోటిక్‌ నూనెలను నాలుగు చెంచాల జొజొబా ఆయిల్‌కు కలపాలి. లేదా 3 చుక్కల జెరేనియం, చుక్క రోజ్‌మెరీ నూనె, 2 చుక్కల జాస్మిన్‌ ఆయిల్‌ కలిపి అయినా రాసుకోవచ్చు. అంత సమయం లేదంటే ఎంచుకున్నదాన్ని ముందుగా చెవి వెనుక కొద్దిగా రాయండి. 24 గంటలయ్యాక ఎలాంటి అలర్జీలూ లేవనుకుంటే వాడొచ్చు. లేదూ దుస్తులకు గంట ముందు స్ప్రే చేసి, పక్కన పెట్టి, తర్వాత వేసుకున్నా మంచిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్