ఒంటరిగా మాట్లాడాలంటే భయం!

మా బాస్‌ వయసు 35. వయసులో అతనికంటే నేను చాలా చిన్న అయినా మర్యాదగా ప్రవర్తిస్తాడు. చిక్కల్లా మా పెద్ద బాస్‌.. అంటే బాస్‌ వాళ్ల నాన్నతోనే! వ్యాపార బాధ్యతలన్నీ కొడుక్కి అప్పగించినా అప్పుడప్పుడూ ఆఫీస్‌కి వస్తుంటాడు. నలుగురి ఎదుటా ప్రవర్తన పెద్దరికంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడే మాటతీరు, చేష్టలు ఇబ్బందికరంగా ఉంటాయి.

Updated : 10 May 2023 05:41 IST

మా బాస్‌ వయసు 35. వయసులో అతనికంటే నేను చాలా చిన్న అయినా మర్యాదగా ప్రవర్తిస్తాడు. చిక్కల్లా మా పెద్ద బాస్‌.. అంటే బాస్‌ వాళ్ల నాన్నతోనే! వ్యాపార బాధ్యతలన్నీ కొడుక్కి అప్పగించినా అప్పుడప్పుడూ ఆఫీస్‌కి వస్తుంటాడు. నలుగురి ఎదుటా ప్రవర్తన పెద్దరికంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడే మాటతీరు, చేష్టలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎవరితోనైనా చెబితే నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావంటున్నారు. ఏం చేయాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌

కొంచెం ఇబ్బందికర పరిస్థితే! ఆడవాళ్లు సహజంగానే తమపై ఇతరుల చెడు ఉద్దేశాన్ని సులువుగా పసిగట్టగలరు. కాబట్టి, మీ ఉద్దేశం తప్పన్న భావనలోకి వెళ్లాల్సిన పనిలేదు. ఇక సమస్య విషయానికొస్తే.. ఆయన మీ సంస్థ అధిపతి అంటున్నారు. యజమానే దాన్ని నిర్వహిస్తున్నారంటే.. కట్టుదిట్టమైన హెచ్‌ఆర్‌ విధానాలు, మహిళా కమిటీలు వంటివి లేనట్లున్నాయి. ఇంకా అతని ప్రవర్తన చర్యలు తీసుకునే స్థితివరకూ వెళ్లలేదు. కాబట్టి, ముందు ఆయనతో ఒంటరిగా ఉండాల్సి వచ్చే అవకాశాలకు వీలైనంత దూరంగా ఉండండి. ముందు మీలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న వారెవరైనా ఉన్నారేమో గమనించి వాళ్లతో మాట్లాడండి. లేదూ ఆయన తీరు మిమ్మల్ని ఎలా ఇబ్బందిపెడుతోందో నేరుగా చెప్పేయండి. తెలియక చేస్తోంటే పద్ధతి మార్చుకుంటారు. ‘మాట్లాడే ధైర్యం చేయలేను’ లేదా  ‘విషయం చెప్పినా లాభం లేదు’ అనిపించిందనుకోండి.. వేరే దారులు వెతుక్కోవాల్సిందే. నేరుగా మాట్లాడాలనుకుంటే మాత్రం వాడే పదాల విషయంలో జాగ్రత్త. నిలదీస్తున్నట్లో, బెదిరిస్తున్నట్లో మీ తీరు ఉండకూడదు. దీనివల్ల ప్రతికూల ప్రభావమే ఎక్కువ. కాబట్టి ‘మీరిలా మాట్లాడుతోంటే నాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం దీన్ని పరిగణనలోకి తీసుకోండి’ అని నెమ్మదిగా చెప్పి చూడండి. ముందు ప్రయత్నం చేయండి. కుదరనప్పుడు వేరే ఉపాయం ఆలోచించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్